వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పంలో ఓడాక చంద్రబాబుకు పిచ్చెక్కింది-రోజా వ్యాఖ్యలు-వరదలేమైనా పుష్కరాల ఘటనా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయంలో మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రజలు ప్రభావితమయ్యారని, ఈ వరదలు మానవతప్పిదమేనని విమర్శించారు. దీనిపై ఇవాళ వైసీపీ స్పందించింది.

రాయలసీమ టూర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత పిచ్చెక్కిందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రోజా... చంద్రబాబు వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. హుద్ హుద్ తుపాను బాధితుల్ని ఇప్పటికీ ఆదుకోని చంద్రబాబు.. రాయలసీమ బాధితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు

ysrcp mla roja says chandrababu got mad after tdp defeat in kuppam constituency

గాల్లో వచ్చిన వాడు గాల్లోనే పోతాడు అంటూ చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి సోనియా, చిదంబరంల కాళ్ళమీద పడింది చంద్రబాబేనన్నారు. భారీ వర్షాలను మానవతప్పిదం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని రోజా ఆక్షేపించారు. గోదావరి పుష్కరాల సందర్బంగా షూటింగ్ పిచ్చితో 29 మంది ని చనిపోయేలా చేసింది చంద్రబాబు అనీ.. మానవ తప్పిదం అంటే అదే అని అన్నారు.ఆ ఘటనలో వాస్తవాలు బయటకు రాకుండా సీసీ ఫుటేజ్ ని డిలీట్ చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ ఫుటేజ్ బయటకు వచ్చి ఉంటే చంద్రబాబు చిప్పకూడు తినేవాడు అని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం లోకేష్ ఎమ్మెల్యే కావడం జరగని పని రోజా జోస్యం చెప్పారు.

English summary
ysrcp mla rk roja on today made counter attack on opposition leader chandrababu's criticism over rayalaseema floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X