వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరుల హల్చల్ .. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఇంటిపై దాడి
ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది కాలం అయినా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విధ్వంసం సృష్టించటం రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం పెరిగిపోయింది. రాజకీయ కక్షలు , కార్పణ్యాలు బాగా పెరిగిపోయాయి. కరోనా రాక ముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా బెదిరింపులు, దాడులు కొనసాగాయి.

కర్నూలు ఖడక్‌పురలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అనుచరుల వీరంగం
ఇక తాజాగా ఒక పక్క కర్నూలులో కరోనా విస్తరిస్తున్నా రాజకీయ ఘర్షణలు మాత్రం ఆగటం లేదు . కర్నూలు ఖడక్‌పురలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అనుచరులు వీరంగం సృష్టించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తాము చెప్పిన మాటలు వినలేదంటూ స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి అలీఖాన్ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి చేశారు. అలీఖాన్ ఇల్లు ద్వంసం చేశారు . వీరంగం వేశారు. ఇంట్లోని వస్తువులను సైతం ధ్వంసం చేశారు.

టీడీపీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసిన అలీఖాన్ ఇంటిపై దాడి
ఇక అలీఖాన్ ఇంటిపై రాళ్లు, కర్రలు విసిరి నానా రచ్చ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన బైక్స్ ని కూడా ధ్వంసం చేశారు. 20మందికి పైగా గుంపుగా వచ్చి కొద్దిసేపు నానా రచ్చ చేసి వెళ్లారు. ఇక అలీఖాన్ ఇంటిపై జరిగిన దాడి అంతా అలీఖాన్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఇంతగా వారు దాడి చెయ్యటానికి అలీఖాన్ చేసిన తప్పు ఒకటే. చాలా కాలంగా టీడీపీలో క్రీయ శీలకంగా ఉన్న అలీఖాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు సమాచారం.

గతంలోనూ అలీఖాన్ పై దాడికి యత్నాలు .. బెదిరింపులు
ఇక అలీఖాన్ ను నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని చాలా సార్లు చెప్పినా ఆయన వినిపించుకోలేదు .దీంతో గతంలో చాలా సార్లు అతనిపై దాడి చేసే ప్రయత్నాలు చేసినట్లు అలీఖాన్ సన్నితులు తెలిపారు. ఇక అప్పుడే కేసు పెడదాం అంటే అలీఖాన్ వర్గంపై ఎమ్మెల్యే వర్గం ఒత్తిడి పెంచి కేసులు పెట్టకుండా చేశారని ఆరోపించారు. ఇక తాజాగా ఎమ్మెల్యే అనుచరుల నుంచి తమకు ప్రాణహని ఉందని అలీఖాన్ కుంటుంబం పోలీసులను ఆశ్రయించింది.
Recommended Video

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. కేసు నమోదు
తమకు రక్షణ కల్పించాలని అలీఖాన్ తల్లి విజ్ఞప్తి చేస్తుంది.దాడి ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే అనుచరులు ఇంట్లోకి వెళ్లి మరీ వస్తువులను బయటపడేసి భయభ్రాంతులకు గురి చెయ్యటంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వీరి దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతా జరిగినా , ఎమ్మెల్యే అనుచరుల పని అని చర్చ జరుగుతున్నా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాత్రం ఈ దాడి ఘటనపై స్పందించలేదు .
-
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications