దమ్ముంటే అసెంబ్లీకి రండి-చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యేల సవాళ్లు...

రేపు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సమావేశాలకు వైసీపీ అన్ని అస్త్రాలతో సిద్దమైంది. అయితే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అధినేత లేకుండానే హాజరుకాబోతున్నారు. దీంతో చంద్రబాబు లేని లోటు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు రాకుండా చంద్రబాబు బాయ్ కాట్ చేయడాన్ని ప్రభుత్వ ఛీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తప్పుబట్టారు. సీఎం జగన్ కు మొహం చూపించలేకే చంద్రబాబు అసెంబ్లీకి రావడం లేదన్నారు. చర్చ పేరుతో బయటి నుంచి సవాళ్లు విసరడం కాదని, సభకు రావాలని చంద్రబాబును ప్రసాదరాజు కోరారు. ప్రతిపక్షాలు సభకు రావాలని, సభలో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రసాదరాజు తెలిపారు. మాట్లాడటానికి ఏమీ లేకే చంద్రబాబు సభకు గైర్హాజరు అవుతున్నారని ఆరోపించారు.

ysrcp mlas dares chandrababu to come to assembly to debate anything amid his boycott

చంద్రబాబు తనకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి కోరారు. ఈ మూడేళ్లలో ప్రజలకు తాము ఏమేం చేశామో చెబుతామని, కానీ మీకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి విపక్షనేత ఉండడం మరో దౌర్భాగ్యమన్నారు. ఇది చాలా దురదృష్టకరమని పార్ధసారధి విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. కానీ పిరికిపందలా పారిపోయి, అమరావతి పాదయాత్రలతో విద్వేషపూరిత రాజకీయాలు చేయడం సరికాదని పార్ధసారధి పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నీ తాబేదార్లను ముందు పెట్టి మాట్లాడిస్తున్నావు. ఇది ఒక ప్రజా రాజధాని అని వారితో చెప్పిస్తున్నావు. ఇది ఎంత వరకు సబబని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+