Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో వైసీపీ "ఎమ్మెల్సీ" క్యాంపు- ఎంతిస్తారంటారు..!!

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా వైసీపీకి ఆధిక్యత ఉన్న విశాఖ గ్రేటర్ మున్సిపాల్టీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బలం ఉంది. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న జగన్ తానే నేరుగా ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ వ్యూహాలను గుర్తించి ధీటుగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తమ ఓటర్లతో బెంగళూరులో క్యాంపుకు నిర్ణయించారు.

క్యాంపుకు తరలింపు
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికను మాజీ సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలో పార్టీకి చెందిన ఓటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నిక ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధర్మ యుద్ధంలో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే తట్టుకుని నిలబడగలడని జగన్ వ్యాఖ్యానించారు. అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బొత్స సమక్షంలో ఆయన సమావేశమయ్యారు.

YSRCP moving Vizag MLC election party voters in for Banglore Camp upto polling day

గెలుపు కోసం
విశాఖ జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో వైసీపీ 600కి పైగా స్థానాల్లో గెలిస్తే.. టీడీపీ కేవలం 200 పైచిలుకే నెగ్గిందన్నారు. రెండు పార్టీల మధ్య 387 స్థానాల తేడా ఉందన్నారు. ఇంత భారీ తేడాలో వైసీపీ గనుక వెనుకబడి ఉంటే.. ఉపఎన్నికలో పోటీ చేసేవాళ్లం కాదని జగన్‌ చెప్పారు. మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదన్నారు. జగన్‌ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే.. అవతలి వాళ్లకు మెజారిటీ ఉంటే పోటీ చేసేవాళ్లం కాదన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఉన్నారని.. డబ్బులు ఉన్నాయని కొనుగోళ్లకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

YSRCP moving Vizag MLC election party voters in for Banglore Camp upto polling day

ఎంత ఇస్తారంటూ చర్చలు
2014 ఎన్నికల్లో ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వనందునే ఓడిపోయామన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది టీడీపీకి వెళ్లారని.. తర్వాత వారు వెనక్కి వస్తామన్నా రాజకీయాల్లో ఇది సరికాదని తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు వారంతా రాజకీయంగా కనుమరుగైపోయారని అన్నారు. నాయకుడు విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడని జగన్‌ చెప్పారు. గురువారం పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులను జగన్ కలవనున్నారు. ఈ సమయంలోనే క్యాంపుకు వెళ్తున్న పార్టీ నేతల మధ్య ఎంతఇస్తారనే చర్చలు జరుగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+