Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందుకే ఆళ్ల రాజీనామా ! అసలు రీజన్ చెప్పిన అన్న అయోధ్య రామిరెడ్డి..

వైసీపీలో ఇవాళ ఉన్నట్లుండి ఓ కుదుపు. సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ ఉదయం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ గీసిన గీత దాటరని పేరున్న ఆర్కే ఇవాళ హఠాత్తుగా ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం జరిగింది ? వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే పార్టీలో కొనసాగే అవకాశం ఉండి కూడా ఇలా సభ్యత్వం కూడా వదులుకోవడం వెనుక ఏం జరిగిందన్న చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన అన్న, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. సోదరుడు రామకృష్ణారెడ్డి రాజీనామా నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్న అయోధ్య రామిరెడ్డి తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడి రాజీనామా వెనుక కారణాల్ని, వైసీపీ వ్యూహాల్ని కూడా వెల్లడించారు. దీంతో ఆళ్ల రాజీనామా వెనుక ఉన్న సస్పెన్స్ పై క్లారిటీ వచ్చినట్లయింది.

ysrcp mp ayodhya ramireddy reveals reason behind brother alla ramakrishna reddy resignation

వ్యక్తిగత కారణాల వలనే తన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాలకి దూరంగా ఉండాలి అనుకున్నారని ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆర్కే బాగా పనిచేశారన్నారు. మంగళగిరి నియోజకవర్గం మొదట నుండి బీసీ సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉన్నందున ఈసారి సదరు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ అనుకున్నారని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. అందుకే గంజి చిరంజీవిని ఇంచార్జ్ గా ప్రకటిస్తున్నామన్నారు.

తన సోదరుడు ఆర్కేకి అసంతృప్తి అనేది లేదని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. రాజకీయ సమీకరణాల వలనే మంగళగిరిలో అభ్యర్ధిని మార్చినట్లు అసలు విషయాన్ని బయటపెట్టారు.తాజా పరిణామాల నేపథ్యంలో తన సోదరుడు కూడా సీఎం జగన్ వెంటే నడుస్తాడని అయోధ్య రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఆర్కేకి కొన్ని అంచనాలున్నాయని, వాటిని అందుకోలేకే రాజకీయంగా దూరంగా ఉండాలని భావించినట్లు అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు.

బాగా ఆలోచన చేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నట్లు అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మళ్లీ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానన్న సంతృప్తి తన సోదరుడిలో ఉందని అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+