అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా లేఖను చంద్రబాబు ముఖంపై విసిరేస్తా

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. మరోసారి తెలుగుదేశం నాయకులపై విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంలో టీడీపీ డ్రామాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది ఫేక్ వీడియో అంటూ జిల్లా పోలీసులు, సీఐడీ అధికారులు తేల్చి చెప్పినా గానీ.. మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీగా మారిందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌లోకి త్రిష..? రాహుల్ జోడో యాత్రలో - కొత్త పాత్రలో..!!కాంగ్రెస్‌లోకి త్రిష..? రాహుల్ జోడో యాత్రలో - కొత్త పాత్రలో..!!

 ఓటుకు నోటు కేసులో..

ఓటుకు నోటు కేసులో..

కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన మాటలు రికార్డయ్యాయని, ఆయన దూతగా వెళ్లిన మనిషి రాజకీయాల్లో ఉన్నాడని గుర్తు చేశారు. ఓటుకు నోటు మీద కేసు నమోదైందని చెప్పారు. కేసులో విచారణను ఎదుర్కోవాల్సి వస్తే.. తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందనే భయాందోళనలతో చంద్రబాబు రాత్రికి రాత్రి పరారయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తన మకాం మార్చారని చెప్పారు.

 చంద్రబాబు ఆడియో..

చంద్రబాబు ఆడియో..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశం యావత్తూ చంద్రబాబు బ్రీఫ్డ్ మీ ఆడియోలను వినిందని గోరంట్ల మాధవ్ అన్నారు. అలాంటి అంశం మీద ఒక్క నిమిషమైనా డిబేట్ పెట్టగలిగే దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీకి చెందిన అనుకూల మీడియా మీద ఉందా అంటూ సవాల్ విసిరారు. ఫేక్ వీడియో, ఫేక్ ఫోరెన్సిక్ నివేదికతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి అడ్డంగా దొరికిపోయారని, వారి బతుకే ఫేక్ బతుకని మండిపడ్దారు.

 మహిళలను కించపరచలేదా?

మహిళలను కించపరచలేదా?

సొంత పార్టీకే చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ బహిరంగంగా మహిళలను కించపరుస్తూ వారిపై అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేస్తే- దానిపై చంద్రబాబు అనుకూల మీడియా మీడియా ఎందుకు చర్చ పెట్టలేదని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. అమ్మాయి కనిపిస్తే వెళ్లి ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేసేయాలి.. అంటూ బాలకృష్ణ ఇదివరకు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన వినిపించారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై..

బాలకృష్ణ వ్యాఖ్యలపై..

వందల మంది పాల్గొన్న ఓ బహిరంగ సభలో బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపైన కూడా చర్చ పెట్టగలిగే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఇదివరకు మహిళల పట్ల అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని గోరంట్ల మాధవ్ చెప్పారు. దాని మీద కూడా చర్చించగలరా? ఆయన టీడీపీ అనుకూల మీడియాకు డిమాండ్ చేశారు.

కుల దురహంకారానికి..

కుల దురహంకారానికి..



ఒక ఫేక్ వీడియోను అడ్డంగా పెట్టుకుని వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తనను తెలుగుదేశం పార్టీ హింసించడానికి ప్రయత్నిస్తోందని గోరంట్ల మాధవ్ చెప్పారు. తనను హింసించడానికి టీడీపీ నాయకులు చేస్తోన్న ప్రయత్నాలన్నింటినీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు గమనిస్తోన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుల దురహంకారానికి ఇది పరాకాష్ఠ అని చెప్పారు.

నిజమని తేలితే..

నిజమని తేలితే..

ఆ వీడియో తనదేనని నిరూపిస్తే రాజీనామా లేఖను చంద్రబాబు ముఖం మీదికి విసిరేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గోరంట్ల మాధవ్ అన్నారు. అది ఫేక్ వీడియో అని అంగీకరించి చంద్రబాబు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. చివరికి గెలిచేది న్యాయం, ధర్మమేనని, దానికి కట్టుబడి ఉన్న తానే అంతిమ విజేతనవుతానని అన్నారు. కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గోరంట్ల మాధవ్ తేల్చి చెప్పారు.

కాణిపాకంలో ప్రమాణం చేద్దామా?

కాణిపాకంలో ప్రమాణం చేద్దామా?

ఎప్పుడైనా సరే తాను కాణిపాకానికి వస్తానని స్పష్టం చేశారు. ఫేక్ వీడియోతో బీసీ ఎంపీని కించపరిచే ప్రయత్నం చేశారని, దీనికోసం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తైతక్కలాడాల్సిన అవసరం లేదని, ఓటుకు నోటు వీడియో మీద చంద్రబాబు ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియో మీద కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఓటుకు నోటు విషయంలో ప్రమాణం చేయడానికి చంద్రబాబు సిద్ధమా? అని అన్నారు.

English summary
YSRCP MP Gorantla Madhav slams Chandrababu and other TDP leaders over fake video call row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X