వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని అమరావతి ప్రాంతంలో ఆ ప్లాట్ల కేటాయింపుపై కీలక పాయింట్

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ హయాంలో ఈ సబ్ ప్లాన్ అమలును బేరీజు వేస్తోన

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ హయాంలో ఈ సబ్ ప్లాన్ అమలును బేరీజు వేస్తోన్నారు ఈ రెండు పార్టీల నాయకులు. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటోన్నారు.

Oscar 2023కి నాటు నాటు నామినేట్: చరిత్ర లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఆర్ఆర్ఆర్Oscar 2023కి నాటు నాటు నామినేట్: చరిత్ర లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఆర్ఆర్ఆర్

 తప్పుడు కథనాలు..

తప్పుడు కథనాలు..

ఈ అంశంపై తాజాగా బాపట్లకు చెందిన లోక్ సభ సభ్యుడు నందిగాం సురేష్ స్పందించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్ర‌బాబు సొంత ఊరిలో ఎస్సీలకు ఎవరి హయాంలో ఎంత మేలు జరిగిందో చర్చిద్దామా? అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పై చంద్రబాబు తన అనుకూల మీడియాలో తప్పుడు కథనాలను రాయిస్తోన్నారని మండిప‌డ్డారు.

చిన్నచూపే..

చిన్నచూపే..

చంద్రబాబుతో పాటు ఆయనకు బాకాలు ఊదే మీడియా పెద్దలకు బడుగు బలహీన వర్గాలపై ప్రేమ లేదని, ఎప్పుడూ దళితులు, గిరిజనులను చిన్నచూపే చూశారని నందిగాం సురేష్ ఆరోపించారు. వారికి ఇప్పుడు ఆకస్మాత్తుగా ఎస్సీలు గుర్తుకొచ్చారని, లేని ప్రేమను ఒలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదంతా నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర సమయంలోనే తప్పుడు కథనాలను ఎందుకు ముద్రిస్తున్నారని నిలదీశారు.

ఎవరు గొప్ప..

ఎవరు గొప్ప..

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో ఎస్సీలకు 33,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని, వైఎస్ జగన్ తన మూడున్నర సంవత్సరాల్లోనే 48,000 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశారు చెప్పారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు గొప్పా? లేకపోతే అదే ఎస్సీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న జగన్ గొప్పా? అని నందిగాం సురేష్ ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలో..

రాజధాని ప్రాంతంలో..

రాజధాని అమరావతి ప్రాంతంలో ఎస్సీలకు ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే.. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంటూ చంద్రబాబు అడ్డుకున్న విషయాన్ని నందిగాం సురేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీడియా మొత్తం చంద్రబాబుకు భజన చేస్తూ- అలా ఇళ్ళ పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ రాతలు రాశారని గుర్తు చేశారు. అలాంటి వారు ఆకస్మికంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అంటూ దళితుల మీద లేని ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ పైనా..

పవన్ కల్యాణ్ పైనా..

ఈ విషయంలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌...తన సభల్లో తన అన్న నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ ను తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులను ఏనాడైనా పక్కన కూర్చోబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. అలాంటి పవన్‌ కళ్యాణ్‌ కూడా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని చురకలు అంటించారు. జనసేన నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గెలిస్తే ఆయనను ఏనాడైనా ప్రశంసించారా? లేక వెంటేసుకుని ఎక్కడికైనా వెళ్లారా అని నిలదీశారు. వాటన్నింటినీ చంద్రబాబు అనుకూల మీడియా ఎందుకు ప్రశ్నించదని నందిగాం సురేష్ చెప్పారు.

English summary
YSRCP MP Nandigam Suresh lashes out at Chandrababu over SC ST Sub plan implementation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X