కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్
దమ్ముంటే అనర్హత వేటేయాలంటూ సొంత పార్టీకి, అధినేత వైఎస్ జగన్ కు సవాళ్లు విసురుతోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో బాంబు పేల్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిల వల్ల కాని అనర్హత అంశంపై జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, నర్సాపురంలో ఉప ఎన్నికపై సర్వేలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం నాటి 'రాజధాని రచ్చబండ' ప్రెస్ మీట్ లో పలు అంశాలపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

నర్సాపురం ఉప ఎన్నిక సర్వే
''టీటీడీ చైర్మన్ గానే కాకుండా మా గోదావరి జిల్లాలకు పాలెగాడిగా వ్యవహరిస్తూ, అవ భూముల కుంభకోణానికి పాల్పడిన వైవీ సుబ్బారెడ్డి నా పాలిట సైంధవుడిగా వ్యవహరిస్తున్నారు. అసలు జగన్ కు, నాకు మధ్య వ్యవహారం చెడిందే సుబ్బారెడ్డి వల్ల. అనర్హత అంశం ఎంతకీ తేలకపోయేసరికి, నేను చేసి చూపిస్తానని సుబ్బారెడ్డి ఛాలెంజ్ విసిరాడట. అదే పనిగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని తీసుకుని కొరియర్ బాయ్ లాగా ఢిల్లీలో అందరికీ పంచిపెడుతూ తానేదో జాతీయ నాయకుడిలా బిల్డప్ ఇస్తున్నాడు. నాపై అనర్హత ఖాయమని, నర్సాపురం లోక్ సభ స్థానంలో ఉప ఎన్నిక వచ్చేస్తోందని సర్వేలు కూడా చేయించాడని తెలిసింది. అయితే,

గూబ పగిలేలా సర్వే ఫలితం..
నర్సాపురం ఉప ఎన్నికపై వైవీ సుబ్బారెడ్డి చేయించిన సర్వేల్లో వైసీపీకి గూబ పగిలేలా ఫలితాలు వచ్చాయి. సర్వేల పేరుతో పార్టీ డబ్బులను వృధా చేయడమేకాకుండా, అసలైన సర్వే రిపోర్టు జగన్ దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నాడీ సుబ్బారెడ్డి. ప్రజల చేత ఎన్నికైన ఒక ఎంపీని తొలగించే అంశంపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో స్పష్టంగా రాసుంది. ముందుగా సుబ్బారెడ్డి, వాత్సాయన కామసూత్ర పుస్తకాలు చదివడం మానేసి, రాజ్యాంగాన్ని చదువుకోవాలి. అందులోని ప్రొవిజన్స్ ను అధ్యయనం చేయాలి. అంతే తప్ప జగన్ బాబాయి కాబట్టి ఏదైనా చేసేయొచ్చని ఫీలైపోవడం సరికాదు. జగన్ కూడా సుబ్బారెడ్డి లాంటి వాళ్లు ఏం చేస్తున్నారో, ఎంత చెత్త మాట్లడుతున్నారో తెలుసుకుంటే మంచింది. ఈ బాబాయి సంగతి ఇలా ఉంటే, మరో బాబాయి..

ఏబీవీకి రివార్డు ఇవ్వాల్సిందిపోయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయంటూ సీబీఐకి లేఖ రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై జగన్ సర్కారు వ్యవహార వైలి మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. వివేకా చనిపోయిన రోజు సరిగ్గా ఏం జరిగింది, రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన గుండెపోటుతో మరణించారని తప్పుడు ప్రచారం ఎలా సాగింది, తెల్లవారుజామున చనిపోతే, సాయంత్రం దాకా కనీసం దాన్ని హత్యగా ఎందుకు గుర్తించలేదనే కీలక అంశాలను గుర్తించిన ఏబీవీకి రివార్డు ఇవ్వాల్సింది పోయి, సీబీఐకి లేఖ రాయడం సర్వీసు నిబందనలకు విరుద్ధమనే సాకుతో చర్యలకు దిగడం విచిత్రం. ఇదే ఏబీవీ లేఖను అటాచ్ చేస్తూ నేను కేంద్ర హోం మంత్రి, డీవోపీటీ శాఖలకు లేఖలు రాశాను. వివేకాను హత్య చేసిన అసలు నిందితులు బయటికి రావాల్సిందే. ఇక..

హీరోల భార్యలంతా తిరుపతిలో..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ రోజున పెద్ద ఎత్తున దొంగ ఓట్ల వ్యవహారం నడిచింది. ఎవరు చేయించారు అనేది తేలాల్సి ఉన్నా, అక్రమాలు జరిగాయన్న మాటను మాత్రం మిగతా పార్టీలన్నీ గుర్తించాయి. ఒక్క జగన్ మీడియాలో మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాసుకొచ్చారు. పోలింగ్ రోజున తిరుపతికి వచ్చినవాళ్లంతా భక్తులే అని సజ్జల సెలవిచ్చారు. మరి కల్యాణమండపాల్లో విడిది చేసి, దొంగ ఓటర్ ఐడీ కార్డులతో పట్టుబడిన వాళ్లెవరు? పేర్లు, వివరాలు చెప్పమంటే పారిపోయిన వ్యక్తులెవరు? నోటికి సులువుగా వస్తుంది కదాని చాలా మంది సినిమా హీరోల పేర్లు చెప్పుకున్నారు. ఆ లెక్కల నిన్న హీరోల భార్యలు చాలా మంది తిరుపతిలో తేలారు. దీన్నొక సాదారణ విషయంగా వదిలేస్తే, రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికలోనూ ఇలాంటి అక్రమాలు పేట్రేగుతాయి. అందుకే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ కు నేను లేఖ రాశాను. చివరిగా,

విద్యా దీవెన డబ్బులు కాలేజీలకే..
జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ఉద్దేశం మంచిదే అయినా, దానికి విద్యా వేత్తల పేరు పెట్టకుండా జగన్ తన పేరే పెట్టుకోవడం ఇగో సంతృప్తి కోసమే. పిల్లల చదువులపైనే మన ఫోకస్ అయినప్పుడు, విద్యాదీవెన డబ్బులు తల్లికే ఎందుకు ఇవ్వాలి? ఇది ఓట్ల రాజకీయం కాదా? తల్లికి డబ్బులిస్తే, వాటిని తండ్రులు తాగుడు కోసం వాడతారు కదా. దీవెన డబ్బులను ఆయా కాలేజీలకే అందేలా చూస్తే ఈ పథకం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అధ్యాపకుల జీతాలకు సంబందించి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో తేడా చాలా ఉంది. ప్రైవేటోళ్లు తక్కువ జీతానికి పనికిమాలిన సిబ్బందిని పెట్టుకోవడం ద్వారా విద్యా ప్రమాణాలు పడిపోతాయి. అదే జగనన్న దీవెన డబ్బులను ప్రైవేటుకు నేరుగా ఇస్తే మంచి సిబ్బంది వచ్చి విద్యార్థులు బాగుపడతారు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
గాలి ద్వారా కరోనా :ఆ మాస్కులు వద్దు -ఎన్95 లేదా కేఎన్95 మాస్క్‌లే రక్ష -అంటు వ్యాధుల నిపుణులు