వివేకాను ఎవరో చంపితే మీరెందుకు రక్తం తుడిచారు? ఎలా గుండెపోటన్నారు-రఘురామ ప్రశ్నలు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో సాక్ష్యులు, నిందితులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు క్రమంగా బయటికి వస్తున్నాయి. వీటిపై స్పందిస్తున్న వైసీపీ నేతలు.. ఇదంతా సీబీఐ, చంద్రబాబు కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ స్పందించారు. వైసీపీ నేతలకు ఆయన పలు ప్రశ్నలు వేశారు.
Recommended Video

రఘురామ ప్రశ్నలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో చోటు చేసుకుంటున్నే పరిణామాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ స్పందించారు. ముఖ్యంగా వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు, దానిపై వైసీపీ అభ్యంతరాలపై రఘురామ రియాక్ట్ అయ్యారు. సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ వైసీపీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు సరికాదంటూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. వీటిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురిని ఆయన టార్గెట్ చేశారు.

సీబీఐ దర్యాప్తు అడ్డుకోవద్దు
వివేకా హత్య కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తును అడ్డుకునేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఆరోపించారు. వివేకా హత్య కేసును సీబీఐ పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని, దానికి ఆటంకాలు కల్పించవద్దని వైసీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రఘురామ తప్పుబట్టారు. సజ్జలను చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు.

ఎవరో చంపితే మీరెందుకు రక్తం తుడిచారు ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై స్పందిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేసిన రఘురామ.. ఎవరో ఆయన్ను చంపితే మీరెందుకు రక్తం తుడిచారంటూ ప్రశ్నించారు. అలాగే మీరెందుకు గుండెపోటని ప్రచారం చేశారని నిలదీశారు. వివేకా హత్య కేసు తర్వాత ఏం జరిగిందో ఇప్పటికే పలువురు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పూస గుచ్చినట్లు చెప్పారు. ఇందులో వివేకా రక్తపు మడుగులో ఉండగా. అక్కడ ఏం జరిగిందో వివరించారు. కానీ దీనికి విరుద్ధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని రఘురామ ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications