కొడాలి నాని పంచ్ ఎలా ఉంటుందంటే..?

మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరుంది మాజీ మంత్రి కొడాలి నానికి. వైఎస్ జగన్ మీద ఈగ వాలనివ్వనంత అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారాయన. జగన్‌ను విమర్శించే వాళ్లకు ఘాటుగా బదులిస్తుంటారు. తూటాల్లాంటి మాటలను సంధిస్తుంటారు. ముఖ్యమంత్రిని విమర్శించేది ఎవరనేది కూడా పట్టించుకోరు. చంద్రబాబు అయినా, పవన్ కల్యాణ్ అయినా, నారా లోకేష్ అనేది చూడరు. తక్షణమే కౌంటర్ అటాక్ చేస్తుంటారు.

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కొడాలి నానికి ఫైర్ బ్రాండ్‌గా ముద్ర ఉంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాలను నిర్వహిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు. జిల్లా రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే కొడాలి నాని- ఇవ్వాళ క్రీడాకారుడి అవతారం ఎత్తారు. వాలీబాల్ ప్లేయర్‌గా కనిపించారు. బంతిపై పంచ్ విసురుతూ, కోర్టులో కలియ తిరుగుతూ గడిపారు.

 YSRCP MP Vallabhaneni Balasouri and former minister Kodali Nani starts Volleyball tournament

మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరితో కలిసి గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇవ్వాళ ఆయన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు కొడాలి నాని. బాలశౌరితో పాటు వేర్వేరు జిల్లాల నుంచి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. వారితో సరదాగా గడిపారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ కోసం గుడివాడకు వచ్చిన క్రీడాకారులను స్థానిక అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

 YSRCP MP Vallabhaneni Balasouri and former minister Kodali Nani starts Volleyball tournament

అంతకుముందు- గుడివాడలో రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు వల్లభనేని బాలశౌరితో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించనున్నట్లు చెప్పారు. గుడివాడ అభివృద్ధికి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోన్నారని అన్నారు.

 YSRCP MP Vallabhaneni Balasouri and former minister Kodali Nani starts Volleyball tournament
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+