బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్టవేసి కుట్రలు .. చేస్తున్న గలీజ్ పనులివే.. తేల్చేసిన విజయసాయి రెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, బిజెపి నేతలతో జరిగిన రహస్య భేటీని ఒక పట్టాన వదిలేలా కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, బిజెపి నాయకులు సుజనాచౌదరి ,కామినేని శ్రీనివాస్ తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైన వేళ రెండు వేరు వేరు మీటింగ్ లను కలిపేశారంటూ సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు.అయితే ఆ సమావేశాలు రహస్య సమావేశాలు కాదని, రహస్యంగా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తమకు లేదని సుజనా చౌదరి పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం ఈ భేటీపై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. కుట్రలు అని మండిపడుతున్నారు.

ముగ్గురూ స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపారాలేమై ఉంటాయబ్బా ?

ముగ్గురూ స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపారాలేమై ఉంటాయబ్బా ?

స్టార్ హోటల్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నాయకులతో భేటీపై వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన అంశాల ప్రస్తావన తెచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి... వీరు ముగ్గురూ స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపార కార్యకలాపాలు ఏమై ఉంటాయబ్బా ? అంటూ పోస్ట్ చేశారు. ఇక మరో పోస్ట్ లో చంద్రబాబు హైదరాబాదులో చేయగలిగిన గలీజ్ పనులు అంటూ,చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

గోతులు తవ్వడం, చీకటి వ్యాపారాలు చేయడం చంద్రబాబు గలీజ్ పనులు

గోతులు తవ్వడం, చీకటి వ్యాపారాలు చేయడం చంద్రబాబు గలీజ్ పనులు

ఇక ఈ ట్వీట్లో బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజ్ పనులు ఇవే.. గోతులు తవ్వడం, చీకటి వ్యాపారాలు చేయడం, మ్యానిప్యులేషన్ లు, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు మునిగితేలుతూ ఉంటాడు .ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనం అయ్యాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు అంటూ చంద్రబాబు నాయుడుపై విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు

బాబు గ్యాంగ్ హైదరాబాద్లో తిష్టవేసి కుట్రలకు తెగబడుతున్నారు

బాబు గ్యాంగ్ హైదరాబాద్లో తిష్టవేసి కుట్రలకు తెగబడుతున్నారు

ఇక మరో ట్వీట్లో ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఏం చేస్తున్నారు? అన్న విషయాలపై విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ తపన పడుతూ ఉంటే, బాబు గ్యాంగ్ హైదరాబాద్లో తిష్టవేసి కుట్రలకు తెగబడ్డారు అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలన ఎలా అడ్డుకోవాలా అని స్కెచ్లు వేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ లో స్టార్ హోటళ్లను కేంద్రంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+