బుడమేరు తర్వాత.. ముందు చంద్రబాబు ఇల్లు కూల్చండి ! సాయిరెడ్డి డిమాండ్..!

ఏపీలో తాజాగా వచ్చిన విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు వాగు ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. నగరంలోని జక్కంపూడిలో ఉన్న వైఎస్సార్ కాలనీలో బుడమేరు ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. దీనిపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం బుడమేరు ఆక్రమణలను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబును ఆయన టార్గెట్ చేశారు.

గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేశారు. అయితే పారిశ్రామికవేత్త లింగమేనని రమేశ్ కు చెందిన ఈ ఇంటిని కూల్చే అవకాశం వారికి దొరకలేదు. దీంతో చంద్రబాబు ఇంటిని వదిలేసి పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చేశారు. అయితే ఆ తర్వాత కూడా జగన్, సాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలంతా చంద్రబాబు అక్రమ ఇల్లు కూల్చేయాల్సిందేనని డిమాండ్లు చేసేవారు. ఇప్పుడు బుడమేరు వరదల నేపథ్యంలో తిరిగి వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిని తెరపైకి తెస్తున్నారు.

ysrcp mp vijayasai reddy demands demolition of cm Chandrababu house- here is reason

బుడమేరు ఆక్రమణల కూల్చివేతకు ముందు సీఎం చంద్రబాబు ఇల్లు కూల్చాలంటూ వైసీపీ ఎంపీ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇందులో అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే అన్నారు.

సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డు ఫై కట్టిన అక్రమకట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్ ఫై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుందని సాయిరెడ్డి ప్రశ్నించారు. అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమకట్టడం మొదట కూలగొట్టడం సముచితం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+