చంద్రబాబుపై సాయిరెడ్డి ట్వీట్ వార్ మళ్లీ మొదలు-టార్గెట్ టీడీపీ మ్యానిఫెస్టో
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినన్ని విమర్శలు ఎవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు, లోకేష్ పై సందర్భం వచ్చినా రాకున్నా ట్వీట్లు పెడుతూ వారిని సాయిరెడ్డి చికాకు పెట్టేవారు. అయితే ఈ ట్వీట్లపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ స్పందించేవారు కాదు. కానీ టీడీపీ కిందిస్ధాయి నేతలు కౌంటర్లు ఇచ్చేవారు. అయితే నందమూరి తారకరత్న ఆస్పత్రిలో చేరాక ఈ ట్వీట్ వార్ కు సాయిరెడ్డి ఎందుకో బ్రేక్ వేశారు.
ఇప్పుడు దాదాపు ఆరునెలల విరామం తర్వాత మళ్లీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై, టీడీపీపై తన ట్వీట్ వార్ మొదలుపెట్టేశారు. టీడీపీ తాజాగా మహానాడు సందర్భంగా రాజమండ్రిలో విడుదల చేసిన మినీ మ్యానిఫెస్టోపై సాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారు? అంటూ సాయిరెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీపై చేసిన ట్వీట్ వైరల్ అయింది.

అమలుచేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టోనే మాయం చేసినవారు ... ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 28, 2023
ఈ 'మాయా'ఫెస్టోలో ఎవరు పడతారు?
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే సుప్రీంకోర్టు దాకా వెళ్లి గుక్కపట్టి ఏడ్చారు...అలాంటి వారు పేదలను కోటీశ్వరులు చేస్తామంటున్న చిత్తశుద్ధిలేని హామీల "మాయాఫెస్టో"ను నమ్మేదెవరు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2023












Click it and Unblock the Notifications