ట్రంప్ ఫ్రస్ట్రేషన్ వెనుక మోడీ ఆ కామెంట్స్ ? సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత అన్ని పదవులకూ రాజీనామా చేసేసి ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి..ఇప్పటికే ఏదో ఒక రాజకీయాన్ని తవ్వుతూనే ఉన్నారు. అలాగే ప్రధాని మోడీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని పొగుడుతూ, సలహాలు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు.

అయితే ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై చూపిస్తున్న అసహనాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో రష్యా చమురు కొంటున్నామన్న కారణంతో ట్రంప్ చూపిస్తున్న ఫ్రస్టేషన్ వెనుక అసలు కారణం మరొకటి ఉందని తెలిపారు. ఈ కారణం వెనుక ప్రధాని మోడీ చేసిన ఆ వ్యాఖ్యలు ఉన్నాయని సాయిరెడ్డి వెల్లడించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ పై చర్చ జరుగుతోంది. అలాగే ట్రంప్ తాను క్లాస్ కు ఆటోమేటిక్ మెంటార్ లా భావించడం మానుకోవాలని సూచించారు.

ysrcp mp vijayasai reddy reveals reason behind donald trump s frustration on modi

భారత్ ఆపరేషన్ సిందూర్ ను నిలిపివేయడం, పాక్ తో కాల్పుల విరమణ వెనుక తాను ఉన్నట్లు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ.. అది పూర్తిగా తమ సొంత నిర్ణయమని తేల్చిచెప్పేశారు. అయినా ట్రంప్ ఇప్పటికీ భారత్-పాక్ యుద్ధం ఆపింది తానేనని చెప్పుకుంటున్నారు. అయితే మోడీ ప్రకటన తర్వాత ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి దక్కించుకునే అవకాశం పోయిందని, అందుకే ఇప్పుడు మోడీపై ట్రంప్ అసహనం చూపిస్తున్నారని సాయిరెడ్డి విశ్లేషించారు.

ysrcp mp vijayasai reddy reveals reason behind donald trump s frustration on modi

ఈ ట్వీట్ తో పాటు భారత విదేశాంగశాఖ జారీ చేసిన ప్రకటనను కూడా సాయిరెడ్డి జత చేశారు. ఇందులో విదేశాంగశాఖ రష్యా చమురు కొనుగోలు చేయడం వెనుక ఉన్న కారణాలను వెల్లడించింది. తమ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అని విదేశాంగశాఖ ఇందులో చెప్పుకుంది. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి ఆ ట్వీట్ ను షేర్ చేస్తూ రష్యా చమురు కొనుగోలు నిర్ణయం కరెక్టేనని, ట్రంప్ ఫ్రస్ట్రేషన్ వెనుక పైకి చెప్పుకుంటున్నట్లు ఇది కారణం కాదని తేల్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+