14 సంవత్సరాల పాటు సీఎం: కేడర్‌కు క్రిమినల్ సలహాలు: ఇదేనా అనుభవం: విజయసాయి రెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ఘాటు విమర్శలను సంధించారు. పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ చంద్రబాబు.. జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ కేడర్‌కు సూచించడాన్ని తప్పు పట్టారు. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నాయకుడు పార్టీ కార్యకర్తలకు.. మంచిని సూచిస్తుంటారని, చంద్రబాబు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రానికి, సీమాంధ్రకు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబుకు ఉందని, సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా, ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తి.. పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఆదేశాలను జారీ చేయడం సిగ్గుచేటని అన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు క్రిమినల్ సలహాలు ఇవ్వడం అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు.

 YSRCP MP Vijayasai Reddy slams TDP Chief Chandrababu for his comments on Police

పోలీసుల మీద కేసులు పెట్టాలని, వారిని కాళ్ల బేరానికి రప్పించుకోవాలనే ఆలోచన తీరు.. విధానం సరికాదని సాయిరెడ్డి అన్నారు. ఏ నాయకుడైనా తమ పార్టీ కార్యకర్తలకు ప్రజల మనసులు గెలవాలని సలహా ఇస్తారని, చంద్రబాబు మాత్రం తాను భిన్నంగా వ్యవహరిస్తానని మరోమారు నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులను బ్లాక్‌మెయిల్ చేయడం, దాని ద్వారా వారిని తమ ఆధీనంలోకి తీసుకుని రావాలనుకోవడం సరికాదని అన్నారు.

జూమ్ వీడియో ద్వారా చంద్ర‌బాబు చేసే నీచ కుట్ర రాజ‌కీయం మరోసారి బ‌ట్ట‌బ‌య‌లయిందని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. తన రాజకీయ అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి సూచనలు ఇస్తూ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా.. బాధ్యతారహితంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్య‌కర్త‌ల‌ను రెచ్చ‌గొట్టడమే పనిగా పెట్టుకున్నారని, పోలీసుల‌పై కేసులు పెట్టి వేధించాలని దిశా నిర్దేశం చేయడాన్ని చూస్తోంటే.. ఆయన ఎంతగా దిగజారారో తెలుస్తోందని అన్నారు.

Recommended Video

    Janasena BJP Support To Amaravati Farmers, Plans Janabheri Meeting

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+