రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!!
అమరావతి కేంద్రంగా పార్లమెంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభలో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందటంతో.. ఈ రోజు రాజ్య సభలో ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఆప్ సైతం అమరావతి బిల్లు కు మద్దతు ఇచ్చింది. లోక్ సభలో కొన్ని డిమాండ్లు చేస్తూ.. బిల్లు స్వరూపం పైన అభ్యంతరం వ్యక్తం వాకౌట్ చేసిన వైసీపీ రాజ్యసభలో రూటు మార్చింది. కొత్త డిమాండ్ తెర పైకి తీసుకొచ్చింది.
అమరాతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. లోక్‌సభలో వ్యతిరేకించిన విధంగానే రాజ్యసభలోనూ ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మళ్లీ తెర పైకి ప్రత్యేక హోదా డిమాండ్ తీసుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బిల్లులో లేదన్నారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా జరగలేదని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదన్నారు. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు.

అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని సుబ్బారెడ్డి తెలిపారు. రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించార ని.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అంటున్నారని తెలిపారు. రెండేళ్లలోనే రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేశారని.. ఇలాగే కొనసాగితే రూ.14 లక్షల కోట్లకు అప్పు చేరుతుందని చెప్పుకొచ్చారు. అమరావతి అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఆ వెంటనే బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.
తెర పైకి మరోసారి ప్రత్యేక హోాదా డిమాండ్
ఇక, ఇదే బిల్లు పైన కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎంత మంది వేధించినా రైతులు నిరసనలు ఆపలేదని ఆమె అన్నారు. ఇది అమరావతి రైతుల విజయమని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధానిపై 12 ఏళ్లుగా అస్పష్టత ఉందన్నారు. దుగరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయం చేశారంటూ మండిపడ్డారు.
బిల్లు పెట్టడం కాదు.. టైంకు రాజధాని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేసారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆటలు ఆడుతోంది. లక్షా 47 వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు జరగలేదు. భౌగోళికంగా ఏపీలో ఉన్నా.. ఆ గ్రామాలు ఇంకా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు.తెలంగాణలో ఉండాలని కోరకుంటున్న వాళ్లను ఆంధ్రాలో కలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగక తప్పదని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications