ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ (ఫోటోలు)
అమరావతి: ఏపీలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని, విద్యార్థినుల హత్యలకు ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. మంత్రి నారాయణకు చెందిన కాలేజీల్లో సీఎంకు వాటాలు ఉన్నాయన్నారు.
కడపలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినులు మనీషారెడ్డి (15), నందిని (15) మృతదేహాలను కడప రిమ్స్‌లో జగన్ పరిశీలించారు. జరిగిన విషయం గురించి ఆరాతీశారు. అనంతరం మృతుల కుటుంబీకులతో కలిసి శవపరీక్ష గదిలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
నారాయణకు మంత్రిపదవి ఇచ్చి ఆయన స్థాపించిన కాలేజీల్లో బాబు వాటా తీసుకున్నారన్నారు. అందుకే నారాయణ కాలేజీల్లో గడిచిన 14 నెలల్లో 11మంది విద్యార్థినులు చనిపోతే బాబులో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. నారాయణ కాలేజీల్లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా చంద్రబాబు పైకి మొసలికన్నీరు కారుస్తూ లోపల నారాయణకు పూర్తి మద్దతు ఇస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇద్దరు విద్యార్థులు, 9మంది విద్యార్థినులు అనుమానాస్పదంగా మృతిచెందినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని, పోలీసులు, వైద్యులతో తప్పుడు సమాచారం ఇప్పించి కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ విడుదల
సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని, ఆ సమయంలో వారివద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే ఉదయానికే విద్యార్థినుల వద్ద ప్రేమలేఖలున్నట్లు సృష్టించడం సిగ్గుచేటన్నారు.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ విడుదల
విద్యార్థినుల మృతదేహాలను బలవంతంగా వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటుచేశారని, అయితే తాను వస్తున్నానని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై పోస్టుమార్టం గదిలోనే ఉంచారన్నారు. బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్‌ను బెదిరించి కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కడపలో విద్యార్థినుల మృతదేహాలకు సరైన రీతిలో పోస్టుమార్టం నిర్వహించలేదని, హైదరాబాద్‌లో రీ పోస్టుమార్టం నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ విడుదల
రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన రాక్షసపాలనగా తయారైందన్నారు. ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకూ రక్షణ కరువైందన్నారు. పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉంటే పోలీసులు వారిని బయటకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ విడుదల
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈనెల 29వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు సీనియర్ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజధాని కూడా లేని ఏపీ గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ విడుదల
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేకహోదా సాధనలో విఫలమైన చంద్రబాబు ఇటీవల ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం: వైసీపీ బంద్ పోస్టర్ విడుదల
అందుకే ప్రత్యేకహోదా కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ గట్టిగా పోరాడుతోందని, రాష్ట్రానికి ఆ హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు కూడా కావాలన్నదే తమ డిమాండ్ అని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా సాధనకు పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో ఢిల్లీలో ఈనెల 10న ధర్నా చేశామని, దానికి కొనసాగింపుగా 29న రాష్ట్ర బంద్‌కు పిలునిచ్చామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications