వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ప్లీనరీ కమిటీలు - నేతలకు బాధ్యతలు : దుష్ట చతుష్టయం పై తీర్మానం - బైలాస్ లో మార్పు..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ప్లీనరీకి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావటంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మూడేళ్ల పాలనలో సాధించిన విజయాలతో పాటుగా రానున్న ఎన్నికలకు సీఎం జగన్ ప్లీనరీ వేదికగా సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. పాలనా పరంగా- రాజకీయంగా కీలక ప్రకటనలను సిద్దమయ్యారు. దీంతో..పార్టీ నేతలతో పాటుగా శ్రేణుల్లో ప్లనరీ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. రేపు కడప పర్యటకు వెళ్తున్న సీఎం జగన్.. 8వ తేదీ ఉదయం ఇడుపుల పాయలో దివంగత వైఎస్సార్ కు నివాళి అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు.

వైఎస్సార్ ఘాట్ టు పార్టీ ప్లీనరీ

వైఎస్సార్ ఘాట్ టు పార్టీ ప్లీనరీ


8.45కు వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 10.20కి రోడ్డు మార్గాన బయలుదేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పాల్గొంటారు. ప్లీనరీలో తొమ్మది తీర్మానాలు ప్రవేశ పెట్టాలని ఇప్పటి వరకు నిర్ణయించారు. అందులో భాగంగా ప్రభుత్వం ఈ మూడేళ్లలో కీలకంగా భావించిన అంశాలు.. అమలు చేసిన నిర్ణయాలతో పాటుగా రాజకీయంగానూ తీర్మానాలు ఉన్నాయి. అందులో దిశా చట్టం.. విద్యా - వైద్యం, నవరత్నాల పైన తీర్మానాల ప్రతిపాదన..చర్చ..ఆమోదం ఉండనున్నాయి.

సీనియర్లకు కమిటీల బాధ్యతలు

సీనియర్లకు కమిటీల బాధ్యతలు


పరిపాలన - పారదర్శకత పైన తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ..పరిశ్రమలు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తాజాగా ఏపీకి ప్రధమ ర్యాంకు సాధించటం పైన తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ సారి ప్రత్యేకంగా యెల్లో మీడియా - దుష్ట చతుష్టయం అనే అంశం పైన రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. సీఎం జగన్ ప్రతీ సభలో దుష్ట చతుష్టయం పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ తీర్మానం ప్రత్యేక చర్చు కారణమవుతోంది. ఇక, ప్లీనరీ నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేసారు. ప్లీనరీ నిర్వహణ కమిటీ బాధ్యతలు బొత్సాకు కేటాయించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్ గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరించనున్నారు. ప్రజా ప్రతినిధుల సమన్వయ బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.

సీఎం జగన్ ప్రసంగం - ప్రకటన పై ఆసక్తి

సీఎం జగన్ ప్రసంగం - ప్రకటన పై ఆసక్తి


సభా నిర్వహణ ను పెద్దిరెడి చూసుకోనున్నారు. వసతి, తీర్మానాల కమిటీ, భోజన వసతి ఏర్పాట్లు వంటివి పైతం ప్రత్యేకంగా సీనియర్లకు అప్పగించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ బాధ్యత సీనియర్ నేత ఉమ్మారెడ్డి పర్యవేక్షిస్తారు. ఈ సారి ప్లీనరీలో పార్టీ రాజ్యాంగ సవరణల దిశగా నిర్ణయాలు జరగున్నాయి. వీటి బాధ్యతను కమిటీ ఉమ్మారెడ్డికి కేటాయించారు. ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు నిర్ణయించారు. వాటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ బాధ్యతలను వంగపండు ఉషకు కేటాయించారు. ఆడిటోరియం నిర్వహణ కమిటీకి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తారు. వైసీపీ అధ్యక్షుడిగా జగన్ మరోసారి ఈ ప్లీనరీ ద్వారా ఎన్నిక కానున్నారు.

English summary
Committees arranged for YSRCP plenary with senior leaders and Resolution decided to propose and pass. Political resolution is becoming interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X