MI Vs CSK: రివేంజ్ పోరులో రోహిత్ - ధోనీ రీ ఎంట్రీ వేళ బిగ్ ట్విస్ట్..!!
MI vs CSK: IPL 2026 కీలక దశకు చేరుకుంది. యువ కెరటాలు కొత్త రికార్డులు నెలకొల్పుతూ మజా అందిస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ లో బ్యాటర్లు హీరోలుగా నిలుస్తున్నారు. ఎంత భారీ స్కోరు చేసినా ఛేదన సులభంగా మారిపోయింది. ఊహించని సంచలనాలతో మేటి జట్లుగా చెప్పుకునే ముంబాయి.. చెన్నై పాయింట్ల పట్టికలో వెనుకంజలో ఉన్నాయి. ముంబాయి పరిస్థితి మరీ ఘోరం గా ఉంది. ఈ రెండు జట్లకు దిగ్గజాలు ధోనీ.. రోహిత్ ఈ రోజు జరిగే మ్యాచ్ లో రీ ఎంట్రీ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హోం గ్రౌండ్ లో జరిగే ఈ మ్యాచ్ పైన సీఎస్కే భారీ అంచనాలతో ఉంది. CSK ఇప్పటివరకు 8 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టిక ఏడో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచుల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇవాళ ముంబై ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో.. చెన్నై కంటే ముంబాయికి ఈ మ్యాచ్ కీలకంగా మారుతోంది. ముంబాయిలో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ టీం పైన చెన్నై విజయం సాధించింది. దీనికి ప్రతికారం తీర్చుకోవాలని ముంబాయి భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ లో అటు రోహిత్.. ఇటు ధోనీ ఆడటం పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇద్దరూ ఫిట్ గా ఉన్నా.. తుది జట్టులో ఉండటం పైన ఇంకా స్పష్టత రావటం లేదు.

రెండు జట్లకు కీలక మ్యాచ్
ఈ ఇద్దరు ఆడటం పైన రెండు జట్ల పైన నుంచే ఒకటే సమాధానం వస్తోంది. ఇద్దరి ఎంపిక పైన టాస్ సమయంలోనే క్లారిటీ ఇస్తామని చెబుతున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అటు రోహిత్ శర్మ తొలి రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడారు. ఇప్పుడు ముంబాయి కి ఈ మ్యాచ్ సహా రానున్న ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చెన్నై సైతం పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతోంది. రెండు జట్లు కష్ట సమయంలో ఈ ఇద్దరు సీనియర్లు లేకపోవటం సమస్యగా మారుతోంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ విఫలం అవుతున్నా... సంజూ ఫాంలోకి రావటం జట్టుకు కలిసొచ్చే అంశం. అటు ముంబాయి లో రికెల్టన్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసాడు. క్వింటన్ డికాక్ , శాంట్నర్ గాయాల బారిన పడ్డారు. దీంతో.. రోహిత్ ఈ మ్యాచ్ లో ఆడటం అవసరంగా కనిపిస్తోంది. దీంతో.. తుది జట్ల లో ధోనీ - రోహిత్ ఆడటం పైన మ్యాచ్ ప్రారంభం వేళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications