H-1B: రాబోయే 365 రోజుల్లో వీసా రూపురేఖలు మార్చేయనున్న ట్రంప్!

అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కనే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా లక్షలాది మంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఇది ఒక కీలకమైన మలుపు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ వీసా వ్యవస్థ రాబోయే 365 రోజుల్లో పూర్తిగా మారిపోనుందని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. విదేశీ కార్మికుల వీసాల పేరుతో జరుగుతున్న అక్రమాలను ఏరిపారేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. రాబోయే ఏడాది కాలంలో ఈ వీసా విధానం ప్రస్తుత రూపంలో ఉండకపోవచ్చని, కఠినమైన ఆంక్షలు రానున్నాయని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

కేవలం కాగితాల సమస్య కాదు.. భారీ కుంభకోణం!

ఇప్పటివరకు చాలామంది దీనిని సాధారణ పత్రాల తప్పుగా లేక చిన్నపాటి పొరపాట్లుగా భావించారు. కానీ ఇది కేవలం అకౌంటింగ్ లేదా పేపర్‌వర్క్ సమస్య కాదని, దీని వెనుక పెద్ద ఎత్తున మోసాలు, కార్మికుల దోపిడీ జరుగుతోందని లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పొసిటో తేల్చిచెప్పారు. అమెరికన్ ప్రజలకు ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో కళ్లకు కట్టేలా ఆధారాలతో సహా నిరూపించేందుకు తాము పకడ్బందీగా కేసును సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ దర్యాప్తు కోసం ప్రభుత్వం భారీ వనరులను కేటాయించి తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

US Labor Inspector General Warns of Tougher H-1B Enforcement and Growing Foreign Labor Crackdow

ఇప్పటికే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు

కేవలం మాటలకే పరిమితం కాకుండా అమెరికా అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో దాడులు ప్రారంభించారు. విదేశీ కార్మికుల మోసాలు, కార్మికుల దోపిడీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కోణాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలకు డజన్ల కొద్ది సమన్లు జారీ చేయడంతోపాటు సోదాలు కూడా నిర్వహించినట్లు లేబర్ ఏజెన్సీ ప్రకటించింది. ప్రముఖ ఐటీ కంపెనీలైన కాగ్నిజెంట్, క్లౌడెరా వంటి సంస్థలకు సంబంధించిన వీసా దరఖాస్తులను క్రిమినల్ దర్యాప్తు పూర్తయ్యే వరకు నిలిపివేయడం గమసార్హం.

H-1B Grace Period: 2017 నుంచి ఉన్న వెసులుబాటు రద్దు, అధికారిక ప్రతిపాదన
H-1B Grace Period: 2017 నుంచి ఉన్న వెసులుబాటు రద్దు, అధికారిక ప్రతిపాదన

వైట్‌హౌస్ నిబంధనలు

ఈ దర్యాప్తుతో పాటు వైట్‌హౌస్ కూడా హెచ్-1బీ వీసాలపై నిఘాను మరింత కఠినతరం చేసింది. అమెరికాలో స్థానిక ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలకే విదేశీయులను నియమిస్తున్న కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హెచ్-1బీ దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఆయా కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా లేదా అనే కోణంలో తనిఖీ చేయాలని లేబర్, హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖలను వైట్‌హౌస్ ఆదేశించింది. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చే కొన్ని రకాల హెచ్-1బీ దరఖాస్తులపై ఉన్న ఆంక్షలను 20సెప్టెంబర్ 2027 వరకు పొడిగించారు.

H1B, F1 Visa: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఐసీఈ అటాక్.. భారతీయుల్లో ఆందోళన!
H1B, F1 Visa: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఐసీఈ అటాక్.. భారతీయుల్లో ఆందోళన!

ఐటీ దిగ్గజాలపై పడుతున్న తీవ్ర ప్రభావం

అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాల కారణంగా హెచ్-1బీ దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థల నుంచి వచ్చే రిజిస్ట్రేషన్లు సుమారు 92 శాతం మేర తగ్గాయని వైట్‌హౌస్ వెల్లడించింది. అయితే, హెచ్-1బీ వీసా వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నామని అధికారులు ఎక్కడా అనలేదు. కానీ, భవిష్యత్తులో కంపెనీల లెవెల్‌లో విచారణలు తీవ్రతరం అవుతాయని, నిబంధనల్లో ఊహించని మార్పులు వస్తాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+