DC vs RR: బుడ్డోడిపై ప్రతాపమా ? కివీస్ పేసర్ కు బీసీసీఐ షాక్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా నిన్న రాజస్తాన్-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్లో ప్రపంచ స్థాయి బౌలర్లను ఉతికారేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అనూహ్యంగా ఢిల్లీ పేసర్ కైలే జేమీసన్ (Kyle Jamieson) చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జేమీసన్ విసిరిన యార్కర్ వైభవ్ కాళ్లకు తగిలి వికెట్లను ఎగురగొట్టింది. దీంతో జేమీసన్ ఆవేశం ఆపుకోలేకపోయాడు.
తాను అవుట్ చేసిన వైభవ్ సూర్యవంశీ వైపు చూస్తూ పిచ్చి కేకలు వేశాడు. ప్రపంచ స్థాయి బౌలర్లు అవుట్ చేయలేని ఈ బుడ్డోడిని తాను అవుట్ చేశానన్న ఆనందమో లేక, అప్పటికప్పుడు టాప్ వికెట్ తీశానన్న ఉత్సాహమూ తెలియదు కానీ జేమీసన్ ప్రవరించిన తీరు వివాదాస్పదమైంది. 14 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వైపు చూస్తూ అతన్ని భయపెట్టేలా జేమీసన్ ప్రవర్తించిన తీరు భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సోషల్ మీడియాలో జేమీసన్ పై యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

దీంతో బీసీసీఐ కూడా స్పందించింది. జేమీసన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వికెట్ తీసినంత మాత్రాన వైభవ్ పై అంతలా ప్రవర్తించాలా అంటూ జేమీసన్ కు చురకలు అంటించింది. అంతే కాదు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. దీంతో జేమీసన్ కు షాక్ తప్పలేదు. మ్యాచ్‌లో మరో ఆటగాడిని కించపరిచే లేదా అతని నుండి దూకుడు ప్రతిచర్యను రెచ్చగొట్టే భాష, చర్యలు లేదా సంజ్ఞలను ఉపయోగించడానికి సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఆ కివీ పేసర్ ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో ఈ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు.

That is absolute class! 😮💨#KyleJamieson with a ripper to knock over #VaibhavSooryavanshi!🤯#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/MZ8LkaCvca
— Star Sports (@StarSportsIndia) May 1, 2026
ఐపీఎల్ బాడీ.. ఒక ప్రకటనలో .. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన 43వ మ్యాచ్ సందర్భంగా, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కైల్ జేమీసన్, ఆటగాళ్లు, జట్టు అధికారుల కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్‌ను పొంది, హెచ్చరికను అందుకున్నాడని తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను జేమీసన్ ఉల్లంఘించినట్లు తేలిందని వెల్లడించింది. జేమీసన్ తన తప్పును అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన శిక్షను అంగీకరించాడని కూడా తెలిపింది.














Click it and Unblock the Notifications