భస్మ ఆరతి వేళ బయటపడ్డ శివలింగం, మహాకాళుని గడ్డపై అద్భుతం..

అవంతికా పురిగా పిలువబడే ఉజ్జయిని క్షేత్రం.. కాలానికే అధిపతి అయిన మహాకాళేశ్వరుడు కొలువైన పరమ పవిత్ర భూమి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రంలో తాజాగా ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 2028లో జరగనున్న సింహస్థ కుంభమేళా కోసం నిర్వహిస్తున్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భూమిని చదును చేస్తుండగా, పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన 'భస్మ ఆరతి' జరుగుతున్న సమయంలోనే ఈ శివలింగం బయటపడటం భక్తులను పరవశింపజేస్తోంది.

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆలయ ప్రీపెయిడ్ బూత్ సమీపంలో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతుండగా ఈ శివలింగం కనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఆలయంలో స్వామివారికి భస్మ ఆరతి నిర్వహిస్తున్నారు. ఈ అసాధారణ ఆవిష్కరణ గురించి తెలియగానే యంత్ర ఆపరేటర్ నరేష్ ప్రజాపతి వెంటనే పనులు నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. "తవ్వకాలు జరుగుతుండగా భస్మ ఆరతి వేళ శివలింగం బయటపడటం ఎంతో శుభకరం" అని ఆలయ ప్రధాన అర్చకులు ఆకాష్ శర్మ పేర్కొన్నారు. ఈ వార్త దావాగ్నిలా వ్యాపించడంతో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, శివలింగానికి పూజలు చేసి జలాభిషేకం నిర్వహించారు.

Ancient Shiva Lingam Discovered During Ujjain Mahakaleshwar Temple Expansion Ahead of Simhastha 2028
ద్రాక్షారామంలో దారుణం.. పంచారామ క్షేత్రంలో శివలింగం ధ్వంసం!
ద్రాక్షారామంలో దారుణం.. పంచారామ క్షేత్రంలో శివలింగం ధ్వంసం!

నిలిచిపోయిన పనులు.. పురావస్తు శాఖ దర్యాప్తు

ఈ పరిణామంతో అధికారులు ఆ ప్రాంతంలో పనులను తాత్కాలికంగా నిలిపివేసి, శివలింగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. "ప్రస్తుతానికి పనులను నిలిపివేశాం. భవిష్యత్తులో మరిన్ని కళాఖండాలు దొరికితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని ఆలయ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ అశీష్ ఫల్వాడియా తెలిపారు. పురావస్తు శాఖ అధికారులు ఈ శివలింగంపై అధికారిక దర్యాప్తు నిర్వహించి, దాని ప్రాచీనత, చారిత్రక ప్రాముఖ్యతను అంచనా వేయనున్నారు. ఇప్పటికే ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది కావడంతో, భూ గర్భంలో మరిన్ని చారిత్రక ఆధారాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

శతాబ్దాల నాటి శాపం! కుంగిపోతున్న మహా నగరం
శతాబ్దాల నాటి శాపం! కుంగిపోతున్న మహా నగరం

సింహస్థ కుంభమేళా 2028 కోసం ఏర్పాట్లు

ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళా 2028 మార్చి 27 నుండి మే 27 వరకు జరగనుంది. ఈ మహోత్సవం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భారీ బడ్జెట్‌ను కేటాయించింది. సుమారు రూ. 2,923.84 కోట్లతో రోడ్లు, హోమ్‌స్టేలు, పార్కింగ్ వంటి 22 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగానే ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తాజా ఆవిష్కరణ మహాకాళేశ్వర్ ఆలయ ప్రాశస్త్యాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతుందని భక్తులు గట్టిగా విశ్వసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+