ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిన వైసీపీ..ఇక దబిడి దిబిడే ..!

సినిమాలను రాజకీయాలను వేరు చూడటం కాస్తా కష్టమే. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ ప్రభావం రాజకీయాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఏకంగా సినీ వేదికలపైనే రాజకీయాలు గురించి మాట్లాడటం,ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది.

ఇదే సమయంలో జగన్‌ను విమర్శించిన సినిమాలను వైసీపీ శ్రేణులు బాయ్‌కాట్ చేయడం జరుగుతూ వస్తోంది. ఇలా వైసీపీ బాయ్‌కాట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సైతం వైసీపీ ఎఫెక్ట్ తప్పలేదు.

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎన్టీఆర్ నటించిన 'వార్-2' సినిమా చూట్టు తిరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు 'వార్-2' సినిమాపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.కొంతమంది ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు ఎన్టీఆర్ నటించిన సినిమాను బ్యాన్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

YSRCP Ranks Show Support for Jr NTR s War 2 Amid Political Factionalism

సరిగ్గా ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఎన్టీఆర్ నటించిన 'వార్-2' సినిమతో పాటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా కూడా విడుదల అవుతోంది. 'కూలీ' సినిమా విడుదలై సక్సెస్ కావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు.ఈ ఘటనతో కూటమి రజనీకాంత్ నటించిన "కూలీ" వైపు ఉందని అర్థం అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ కోసం వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి.

ఎన్టీఆర్ నటించిన 'వార్-2' సినిమాను చూడాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పిలుపునిచ్చాయి.అదే విధంగా సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి ఎన్టీఆర్‌కు అనుకూలంగానే వైసీపీ పార్టీ కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌కు వైసీపీ అండగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+