World Cup: వన్డే వరల్డ్ కప్ రేసులో మాజీ ఛాంపియన్ ఫెయిల్..! ఇక అదొక్కటే ఛాన్స్..!

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ ( ICC Men's Cricket World Cup 2027)లో ఆడే జట్లు ఖరారవుతున్నాయి. ఇదే క్రమంలో గతంలో రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ గెల్చుకున్న చరిత్ర ఉన్న ఓ జట్టు మాత్రం ఈసారి నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది. గతంలో ప్రపంచ క్రికెట్ నే శాసించిన ఆ జట్టు.. ఇప్పుడు నేరుగా అర్హత సాధించలేకపోవడంతో క్వాలిఫికేషన్ మ్యాచ్ లు ఆడి గెలిస్తేనే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం దక్కనుంది.

IPL 2027: ఆ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ? తుది దశలో మెగా డీల్..!
IPL 2027: ఆ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ? తుది దశలో మెగా డీల్..!

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు ఆతిధ్య జట్లు అయిన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలను మినహాయిస్తే.. మరో ఎనిమిది జట్లకు మాత్రమే నేరుగా అర్హత సాధించే అవకాశం లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో ఉన్న 8 జట్లకు నేరుగా వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తున్నారు. తాజాగా బెల్ ఫాస్ట్ లో జరిగిన వన్డేలో ఐర్లాండ్ పై విజయం సాధించిన ఆప్ఘనిస్తాన్ జట్టు.. వెస్టిండీస్ (West Indies)ను వెనక్కి నెట్టి వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించింది. దీంతో విండీస్ ఆటోమేటిగ్గా అర్హత సాధించే అవకాశం కోల్పోయింది. ఆటోమేటిగ్గా వరల్డ్ కప్ కు అర్హత సాధించేందుకు జట్లకు ఉన్న గడువు సెప్టెంబర్ 30 అయినా.. వెస్టిండీస్ కు మిగిలి ఉన్న మ్యాచ్ లు మాత్రం రెండే. ఈ రెండు మ్యాచ్ లలో గెలిచినా విండీస్ వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించదు.

West Indies Fail to Secure Automatic 2027 World Cup Qualification Must Enter Qualifiers
IPL 2027: ఐపీఎల్ లో ఎంట్రీకి పాక్ క్రికెటర్ ? -బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ ?
IPL 2027: ఐపీఎల్ లో ఎంట్రీకి పాక్ క్రికెటర్ ? -బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ ?

కాబట్టి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం దక్కించుకోవాలంటే విండీస్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫైయర్‌ టోర్నీ ఆడి గెలవాలి. ఇందులో వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలు కాని, పూర్తి స్థాయి సభ్య దేశాలలో అత్యల్ప ర్యాంకు కలిగిన వెస్టిండీస్, ఐర్లాండ్ తో పాటు క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 నుండి మొదటి నాలుగు జట్లు, క్వాలిఫైయర్ ప్లేఆఫ్ నుండి మొదటి నాలుగు జట్లు ఆడాలి. ప్లేఆఫ్‌లో లీగ్ 2 నుండి చివరి నాలుగు జట్లు, ఛాలెంజ్ లీగ్ నుండి నాలుగు జట్లు ఉంటాయి. ఇది అర్హత మార్గంలో మూడవ దశగా పరిగణిస్తారు. ఇక అర్హత టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు 2027 ప్రపంచ కప్ రెండో రౌండ్‌లోకి నేరుగా ప్రవేశిస్తుంది. రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు మూడు జట్ల సూపర్ సిరీస్‌లోకి ప్రవేశిస్తాయి. దీని విజేత కూడా రెండో రౌండ్‌కు చేరుకుంటుంది. 14 జట్ల ప్రపంచ కప్‌ను మరింత పోటాపోటీగా తక్కువ వ్యవధిలో నిర్వహించేలా ఐసీసీ ఈ మార్పులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+