Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో అన్నదమ్ముల సవాల్: రక్త సంబంధానికి మించి.. !!

టీ20 వరల్డ్ కప్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. నాటి ఫైనల్ రీమ్యాచ్‌గా పరిగణిస్తారు దీన్ని. ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఈ టోర్నమెంట్‌లో భారత్ కు సమవుజ్జీగా నిలిచింది దక్షిణాఫ్రికా. లీగ్స్ ఏ ఈ రెండు జట్లు కూడా ఏ ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోలేదు. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చాయి.

ఏ జట్టు గెలుస్తుందో.. ఏది ఓడుతుందో అని అంచనాలు వేయలేనంత పటిష్టంగా ఉన్నాయివి. రెండు జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. టీ20 క్రికెట్‌లో ప్రస్తుతానికి అత్యుత్తమ జట్లుగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ పోరాటం జరగనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్‌లు, అత్యుత్తమ బౌలర్లు ఈ రెండు జట్లకు బలంగా ఉన్నాయి.

Soth Africa Morne Morkel and Albe Morkel Live as Ahmedabad Prep for IND vs SA Super 8 Clash Heats Up

కాగా- ఈ మ్యాచ్ అన్నదమ్ముల పోరాటానికి అద్దం పట్టనుంది. ఆటగాళ్ల మధ్యే కాకుండా రెండు జట్ల డగౌట్‌లోనూ ఒక ఆసక్తికరమైన పోరాటాన్ని మనం చూడొచ్చు. వారిద్దరూ మరెవరో కాదు.. మోర్నే మోర్కెల్, అల్బీ మోర్కెల్. అన్నదమ్ములు ప్రత్యర్థులుగా మారుతున్నారీ మ్యా,చ్ కోసం. మోర్నే మోర్కెల్ ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో కీలక సభ్యుడు.

41 ఏళ్ల మోర్నే మోర్కెల్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను దెబ్బతీయడానికి ప్రత్యేక వ్యూహాలను రూపొందించి ఉంటాడనడంలో సందేహాలు అక్కర్లేదు. దక్షిణాఫ్రికా తరఫున తన కెరీర్‌లో 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన అనుభవం మోర్నే మోర్కెల్ కు ఉంది. ఆయా ఫార్మట్లల్లో మొత్తం 544 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ల టెక్నిక్స్, వారి బలహీనతలపై అతనికి మంచి అవగాహన, పట్టు ఉంది.

మరోవైపు అతని అన్న ఆల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికా జట్టుకు స్పెషలిస్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోన్నాడు. 44 ఏళ్ల ఆల్బీ మోర్కెల్ దక్షిణాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 58 వన్డేలు, 50 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లలో ఆడాడు. 1,412 పరుగులు చేశాడు. 77 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సుదీర్ఘకాలం ఆడిన ఆల్బీకి, స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. భారత పరిస్థితులపై, టీ20 వ్యూహాలపై ఆయనకు మంచి పట్టు ఉంది.

ఈ మ్యాచ్ అల్బీ మోర్కెల్ మాట్లాడాడు. తమ మధ్య మ్యాచ్ గురించి ప్రస్తావన రాదని, దీని గురించి ఒకరినొకరు మాట్లాడుకోమని అన్నాడు. "మా అమ్మను ఈ మ్యాచ్ చాలా ఇబ్బంది పెడుతోంది. మా ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు.." అని సరదాగా వ్యాఖ్యానించాడు. రక్త సంబంధం ఒకవైపు, వృత్తిపరమైన పోటీ మరోవైపు. ఈ 'మోర్కెల్ ఫ్యాక్టర్' సూపర్-8లో తొలి పాయింట్లను ఏ జట్టుకు కట్టబెడుతుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+