మేం సదా సిద్ధంగా ఉన్నాం: ఎట్టకేలకు మౌనం వీడిన పాకిస్తాన్ ప్రధాని

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్‌కోట్ లో తీవ్ర హింస, ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్ భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రావల్‌కోట్ వీధులన్నీ రక్తసిక్తం అయ్యాయి.

ఈ హింస కారణంగా 400 మంది వరకు స్థానికులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళనకారులు చెబుతుండగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని తిప్పికొడుతోంది. ప్రాణనష్టం చాలా పరిమితమేనని వాదిస్తోంది.ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి సైతం పీఓకే లో నెలకొన్న అస్థిరతపై ఆరా తీసింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తోన్నాయి.

Pakistan PM Shehbaz Sharif says remain open to talks with the Awami Action Committee in PoK hope

ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పీఓకే నిరసనకారులతో తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సమస్యలను ఘర్షణల ద్వారా కాకుండా చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నిరసనలకు పిలుపునిచ్చిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీతో శాంతియుత వాతావరణంలో చర్చలు జరపడానికి ద్వారాలు తెరిచే ఉంచామని అన్నారు.

సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి తాము సదా సిద్ధంగా ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా పరస్పర చర్చలతోనే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. పంతాలకు పోకుండా ఇరుపక్షాలు ఒకే చోట కూర్చుని సానుకూల వాతావరణంలో మాట్లాడుకోవాలని కోరారు. త్వరలో బాధ్యతలు చేపట్టబోయే నూతన ప్రభుత్వం కూడా నిరసనకారులతో ఈ చర్చల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పండగ సీజన్ వేళ.. ఆకాశానికి ఎగబాకిన బంగారం ధరలు: మైండ్ బ్లాక్ రేట్లు
పండగ సీజన్ వేళ.. ఆకాశానికి ఎగబాకిన బంగారం ధరలు: మైండ్ బ్లాక్ రేట్లు

శాంతి, ఓపిక, సహనంతో తమ మనోభావాలను, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజలకు పూర్తి ప్రాధాన్యత లభిస్తుందని షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని, ముఖాముఖి చర్చల ద్వారా మాత్రమే దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!
తెలంగాణలో 4 రోజుల ముందే ఎగిరిన త్రివర్ణ పతాకం: 50 ఏళ్ల తర్వాత: ఆ కంచుకోట ఇకపై..!!

నిరసనల నెపంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, పీఓకేలో అరాచకాలను సృష్టించే ప్రయత్నాలను ఎంతమాత్రం సహించబోమని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. ప్రజాందోళనల ముసుగులో అల్లర్లను ప్రోత్సహించే చర్యలను సమర్థించబోమని వదిలిపెట్టబోమని అన్నారు. ప్రజా ఆస్తులు, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాలని చూసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+