వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే ! మరోసారి జగన్ మార్క్ ఎంపిక !
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరో ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి. అయితే ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కావు. పరోక్ష ఎన్నికలే. రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. ఇందులో రాష్ట్రం నుంచి మూడు ఖాళీలు రాబోతున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీటి కోసం ముగ్గురు అభ్యర్ధుల్ని వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేశారు.
ఏపీ నుంచి ఈసారి సిట్టింగ్ రాజ్యసభ సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వైసీపీ), కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ) పదవీకాలం పూర్తి కాబోతోంది. దీంతో వీరి స్ధానాల్లో మరో ముగ్గురు ఎంపీల్ని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే నేరుగా ఎమ్మెల్యేల ద్వారానే జరిగే ఎన్నిక కాబట్టి ఈ మూడు స్ధానాల్ని వైసీపీ సునాయాసంగా గెల్చుకోవడం ఖాయం. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఏదైనా జరగవచ్చనే అంచనాలున్నాయి.

ఏపీలో ఈసారి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్ల కోసం వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్ధుల్ని సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. వీరిలో వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాసుల్నిఎంపిక చేసినట్లు తెలిసింది. వీరిలో వైవీ సుబ్బారెడ్డి ఓసీ కాగా.. గొల్ల బాబూరావు ఎస్సీ, జంగాలపల్లి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఈసారి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలోనూ జగన్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications