టీడీపీలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి చేరిక- భార్య ప్రశాంతి, నెల్లూరు డిప్యూటీ మేయర్ సహా..!
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా ప్రకటించిన ఆయన.. ఇవాళ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఇతర నాయకులు టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. తనకు కార్యకర్తలు మరోసారి మద్దతుగా నిలవాలని కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవకు మారుపేరని, అజాత శత్రువని తెలిపారు. మరోవైపు విశాఖలో దోచేసిన వ్యక్తికి నెల్లూరు ఎంపీ సీటు ఇస్తున్నారని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు మొదలవుతుందన్నారు.
వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పుల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నెల్లూరు వైసీపీ ఎంపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. అయితే ఆయన పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లలో మాత్రం అభ్యర్ధుల్ని కనీస సమాచారం లేకుండా మార్చేశారు. దీంతో హర్ట్ అయిన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆర్ధికంగా అండదండలు అందించిన వేమిరెడ్డి ఈసారి టీడీపీవైపు మళ్లడంతో నెల్లూరులో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications