సోష‌ల్ మీడియాలో దుమ్ములేపుతున్న "సిద్ధం"..!!

ఎన్నికల వేళ వైసీసీ సిద్దం సభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన వైసీపీ అంతకు మించి అనే స్థాయిలో రాప్తాడులో సభ నిర్వహించింది. రాయలసీమ నుంచి పెద్ద సంఖ్యలో ఈ సభకు ప్రజలు తరలి వచ్చారు. సీఎం జగన్ పార్టీ కేడర్ ను సిద్దం చేసేందుకు ఈ సభల్లో పాల్గొని మార్గనిర్దేశం చేస్తున్నారు. రాప్తాడు సిద్దం సభ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండిండ్ లో ఉంది. వైసీపీ అనుకూల పోస్టులు హోరెత్తుతున్నాయి.

రాప్తాడులో వైసీపీ సిద్ధం సభకు సంబంధించిన అప్‌డేట్స్‌తో సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది. సీఎం జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో సిద్ధం-3 సభ నిర్వహించారు. ఈ స‌భ‌కు రాయ‌ల‌సీమ జిల్లాల నుంచి భారీస్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, అభిమానులు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారు ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీసి, అప్‌లోడ్ చేయ‌డంతో ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌లు సిద్ధం స‌భ ఫోటోల‌తో నిండిపోయాయి. ఇదే సమయంలో ట్విట్ట‌ర్‌లో సిద్ధం హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. జగన్ అనుకూల పోస్టింగ్స్ పెద్ద సంఖ్యలో కనిపించాయి. రాయలసీమ తొలి నుంచి జగన్ కు కంచుకోటగా ఉంది. రాప్తాడు కు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఏరికోరి వైసీపీ సభ ఏర్పాటు చేసింది.

YSRCP Siddham meeting in Raptadu Goes Trending in Social media

ఈ సభ నిర్వహణ బాధ్యతలను సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా అనంతపురం వైసీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్న తరువాత కార్యకర్తల మధ్యకు వెళ్లారు. తన ప్రసంగంలో కార్యకర్తలకు ఎన్నికల వేళ దిశా నిర్దేశం చేసారు. ఏ రోజు చెప్పిన హామీ అమలు చేయని చంద్రబాబు మరోసారి మోసపూరిత హామీలతో వస్తున్నారని చెప్పుకొచ్చారు. 2019 లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి మరోసారి ప్రజల మధ్యకు వచ్చామని జగన్ వివరించారు. పేదల పక్షాన యుద్దానికి సిద్దం కావాలని కేడర్ ను జగన్ పిలుపునిచ్చారు. జగన్ గ్రౌండ్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలో కూడా షేక్ చేయ‌గ‌ల‌మ‌ని ఒక అభిమాని అన‌గా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ జ‌గ‌న‌న్న ఇస్ రోరింగ్‌లైన్ అంటూ పోస్టింగ్స్ కనిపించాయి. సిద్దం సభ వేళ వైసీపీ కేడర్ లో జోష్ పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+