వైఎస్ జగన్ కు ఆ మూడు సంతకాలు గుర్తుచేసిన కోటంరెడ్డి...!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరులో పలు అభివృద్ధి పథకాలకు హామీ ఇచ్చింది. అలాగే వీటిలో కొన్నింటికి శంఖుస్ధాపన చేయడంతో పాటు పూర్తి కూడా చేసి ప్రారంభించింది. అలాగే మరికొన్ని పనులకు ఆమోదం తెలుపుతూ సీఎం జగన్ సంతకాలు కూడా చేసేశారు. అయితే మారిన పరిస్దితుల్లో వాటిని ప్రభుత్వం పక్కనబెట్టేసింది. దీంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ వాటిని గుర్తుచేశారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం పరిధిలో గతంలో పలు అభివృద్ధి పనుల కోసం సీఎం జగన్ సంతకాలు చేశారని, వాటి తాజా స్టేటస్ ఏంటని కోటంరెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో మూడు కీలక సమస్యలపై గతంలో జగన్ సంతకాలు చేశారని, కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని కోటంరెడ్డి తెలిపారు. సీఎం పెట్టిన సంతకాలే దిక్కులేదని ఆయన మండిపడ్డారు.

kotamreddy sridhar reddys reminder to ys jagan for his three signatures

గతంలో వైసీపీతో తాను విభేదించడం మొదలుపెట్టిన తర్వాత పోరాటాలు చేస్తే అప్పట్లో పార్టీ నేతలు పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావని చెప్పారని కోటంరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు వారు ముందుకొచ్చి నిధులు మంజూరు చేయించాలని నేతల్ని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. తాను అధికారానికి దూరమైనా ఆరోగ్యకరమైన రాజకీయాలే చేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండైన ఆయన.. పార్టీపై సందర్భానుసారంగా మాత్రమే విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ నుంచి సస్పైండైన తర్వాత కోటంరెడ్డి గట్టిగా వాయిస్ వినిపించడం మొదలుపెట్టారు. రోడ్లపై నిరసనలు, ధర్నాలు కూడా చేశారు. వాటిని పోలీసులు అడ్డుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఆయన మౌనంగానే తన నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో గతంలో సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని గుర్తుచేయడం ద్వారా స్ధానికంగా వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నట్లు అర్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+