ఉదయగిరిలో రోడ్డుపై ఎమ్మెల్యే మేకపాటి హల్ చల్-వైసీపీ నేతల సవాల్ కు కౌంటర్ ...
ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ హల్ చల్ చేశారు. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్ అంటూ ఉదయగిరి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీ నేతలు విసురుతున్న సవాళ్లకు స్పందించిన మేకపాటి.. రండి చూసుకుందాం అంటూ ప్రతిసవాల్ విసిరారు.
ఉదయగిరిలో రోడ్డుపై ఎమ్మెల్యే మేకపాటి హల్ చల్-వైసీపీ నేతల సవాల్ కు కౌంటర్ ...!#MekapatiChandrasekharreddy #YSRCPLeaders #Udayagiri #APPolitics #AndhraPradesh #APNews #Oneindiatelugu pic.twitter.com/EjyG9z8LYt
— oneindiatelugu (@oneindiatelugu) March 30, 2023
ఉదయగిరికి చెందిన వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి గత కొన్ని రోజులుగా వరుసగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయగిరిలో వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఆయన.. మేకపాటిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మేకపాటి ఉదయగిరి వస్తే తరిమి కొడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్నిరోజులుగా వేచి చూసిన మేకపాటి.. ఇవాళ స్ధానిక బస్టాండ్ సెంటర్ కు వచ్చారు. అక్కడే కుర్చీ వేసుకుని కాసేపు కూర్చుకున్నారు. దమ్ముంటే రావాలని ప్రతిసవాల్ విసిరారు.

వైసీపీ నుంచి తాజాగా మేకపాటిని సస్పెన్షన్ చేయడంతో స్ధానికంగా పలువురు వైసీపీ నేతలు వరుసగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. దీంతో కొంతకాలంగా బెంగళూరులో ఉంటున్న మేకపాటి..తాజాగా నిన్న ఉదయగిరి కి చేరుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరి కి రానివ్వమని, ఇక్కడి నుంచి తరుముతామన్న పలువురు నేతల ఛాలెంజ్ ను ఆయన స్వీకరించారు. ఉదయగిరి బస్టాండ్ వద్దకు వచ్చి గంటసేపు కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని సవాల్ చేశారు. దీంతో బస్టాండ్ సెంటర్ వద్ద భారీగా పోలీసులు, మేకపాటి అభిమానులు చేరుకున్నారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications