బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో రిలీజ్.. లోకేష్, పవన్ నుంచి ప్రాణహాని, ఎక్కడికీ పారిపోలేదంటూ..

తల్లికి అనారోగ్యం ఉందంటూ హైకోర్టులో బెయిల్ తీసుకుని, ఆ తర్వాత దాని పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి బెయిల్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని పేర్కొంటూ అసలు విషయం వెల్లడించారు. దీంతో బోరుగడ్డ వ్యవహారంలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చినట్లయింది.

ysrcp sympathiser borugadda anil kumar released selfie video says not escaped

నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్షసాధిస్తోందని బోరుగడ్డ అనిల్ తెలిపారు. ఫిబ్రవరి 14న మధ్యంతర బెయిల్ పై తాను బయటికి వచ్చానని తెలిపారు. తనకు అనంతపురం కోర్టులో బెయిల్ వస్తుందని తెలిసి కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం చేస్తోందన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, అదే సమయంలో చెన్నై అపోలో ఆస్పత్రిలో తన తల్లికి సర్జరీ జరగడంతో హైకోర్టుకు సమాచారం ఇచ్చామన్నారు.

ఫిబ్రవరి 28న తాను జైల్లో లొంగిపోయానని, మార్చి 3న తాను తిరిగి రిలీజ్ అయ్యానని బోరుగడ్డ తెలిపారు. ఐదుగురు చెల్లెళ్లు ఉన్న తాను తన తల్లిని చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. తాను ఫేక్ సర్టిఫికెట్ పెట్టి హైకోర్టును మోసం చేసి పారిపోయినట్లు జరుగుతోంది దుష్ప్రచారం అన్నారు. తాను జైల్లో ఉంటే ఫేక్ సర్టిఫికెట్ ఎలా పెడతానన్నారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్, పవన్ తనకు శాశ్వతంగా బెయిల్ రాకుండా ఉండేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తనకు ఏమైనా వీరిదే బాధ్యత అన్నారు.

గతంలో జరిగిన పరిణామాలకూ, ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి స్పందించి వాస్తవాలు బయటపెట్టేందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు బోరుగడ్డ అనిల్ తెలిపారు. తనను చూసిన తర్వాతే తన తల్లి కోలుకుంటోందన్నారు. కోర్టు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు న్యాయం చేయాలని బోరుగడ్డ కోరారు. మానవతా దృక్పథంతో తన తల్లిని చూసుకునేందుకు తాను వెళ్తే కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

Take a Poll

పోలీసులు తనపై పెట్టిన సెక్షన్లు చెల్లవన్నారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదన్నారు. ఇలాంటి పరిస్ధితులు ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని చంపాలని చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నారు. తమకు ఏమైనా వీళ్లదే బాధ్యత అన్నారు. అవసరమైతే ప్రాణం వదిలేస్తా కానీ కోర్టు ధిక్కారణ మాత్రం చేయనన్నారు. కాబట్టి కోర్టు పరిశీలించి, తప్పుడు ఆరోపణలు కొట్టేసి తన తల్లిని చూసుకునే అవకాశం కల్పించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+