రికార్డులు తిరగరాస్తున్న పులివెందుల ? ఓటుకు ఎంతో తెలిస్తే షాక్..!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్లుండి జరిగే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక గురించే చర్చ. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో గెలుపోటములు ఆ పార్టీతో పాటు కూటమికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఈ ఎన్నికిల్లో గెలిస్తే జగన్ పని అయిపోయిందని ప్రచారం చేసుకునేందుకు మంచి అవకాశం దొరుకుతుందని కూటమి భావిస్తుండగా.. మరోవైపు ఈ ఎన్నిక గెలిచి తమ కంచుకోట చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలని వైసీపీ ఆశిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను వైసీపీ, టీడీపీ ముమ్మరంగా చేస్తున్నాయి. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ సీటు పరధిలోని గ్రామాల్లో భారీ ఎత్తున వైసీపీ క్యాడర్ ను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ప్రభుత్వం తమదే కావడంతో భారీ ఎత్తున డబ్బు, పదవులు ఆఫర్ చేస్తూ నేతల్ని తమవైపు తిప్పుకుంటున్నారు. దీంతో పులివెందులలో భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ క్యాడర్ చేజారి పోకుండా జగన్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇదే క్రమంలో ఎల్లుండి జరిగే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో విపక్ష వైసీపీతో పాటు అధికార టీడీపీ కూడా ఓటుకు 10 వేల చొప్పున ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఓటుకు రెండు, మూడు వేలు ఇచ్చి సరిపెదామని బావించినా క్షేత్రస్ధాయిలో పరిస్దితి హోరాహోరీగా మారడంతో ఇరు పార్టీలు కూడా కోట్లను కుమ్మరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటుకు 10 వేల వరకూ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

పలు చోట్ల ఓటుకు 10 వేలు ఇచ్చినా ఓటు తమకు కచ్చితంగా పడుతున్న గ్యారంటీ ఇరు పార్టీల్లోనూ కనిపించడం లేదంటున్నారు. రాబోయే 48 గంటల్లో ఏదైనా జరగొచ్చనే వాదన పులివెందులలో వినిపిస్తోంది. ఇవాళ సాయంత్రంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికార పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే వైసీపీ పొరుగు నేతలు కూడా వెళ్లిపోతారు. అప్పుడు స్ధానికంగా పట్టు ఉన్న వైసీపీ నాయకులే ఇక్కడ కీలకంగా మారతారని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications