తునిపై టిడిపి ఎత్తు, వైసిపి పైఎత్తు: జగన్‌ని ఇరికించాలని చూస్తున్నారా?
అమరావతి: తుని సంఘటనలో తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం చేపట్టిన కాపు గర్జన సమయంలో తుని విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

వైయస్ జగన్, చంద్రబాబు
దీనిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి టిడిపి నేతల తీరు వైసిపి వైపు, ఇంకా చెప్పాలంటే వైయస్ జగన్ వైపు వేలు చూపిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ వైసిపి నేత భూమన కరుణాక రెడ్డిని రెండు విడతలుగా మూడు రోజులు విచారించారు.

భూమన విచారణ
భూమన కరుణాకర్ రెడ్డిని తొలుత రెండు రోజులు, ఆ తర్వాత మరోసారి ఒక రోజు సీఐడీ విచారించింది. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పింది. తుని విధ్వంసం ఘటనలో టిడిపి నేతలు మొదటి నుంచి వైసిపి వైపు వేలు చూపిస్తుండటం గమనార్హం.

టిడిపి టార్గెట్
టిడిపి నేతలు వర్ల రామయ్య తదితరులు పలుమార్లు మాట్లాడారు. తుని విధ్వంసం సమయంలోని డ్రోన్ల తీగ లాగితే లోటస్ పాండ్ డొంక కదులుతుందని వ్యాఖ్యానించారు. తుని ఘటనలో ప్రధానంగా వైసిపి పాత్ర ఉందని టిడిపి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.

కాపు గర్జనపై ఎత్తు పైఎత్తు
అదే సమయంలో, వైసిపి నేతలు టిడిపి పైకి ఎదురు దాడికి దిగుతున్నారు. కాపు గర్జన కుట్రేనని, తమను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి ఈ కేసులో టిడిపి నేతలు జగన్ వైపు వేలు చూపిస్తుంటే, వైసిపి నేతలు టిడిపి అధినేత చంద్రబాబు కుట్ర దాగి ఉందని చెబుతున్నారు. తుని విధ్వంసం కేసులో టిడిపి, వైసిపి రాజకీయంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయని అంటున్నారు. వైసిపిని ఇరికించేందుకు టిడిపి చూస్తుంటే, టిడిపి అధినేతను టార్గెట్ చేస్తూ వైసిపి ఎదురు దాడి చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications