ఏపీ-తెలంగాణలో ఓటు హక్కుపై ఈసీని ఆశ్రయించనున్న వైసీపీ ! ఎన్నికల వేళ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమవుతోంది. రేపు తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో తెలంగాణలో ఏపీ సెటిలర్ల ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీలో అధికార వైసీపీ ఓ కీలక అంశంపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్న వారిపై చర్యలు కోరుతూ వైసీపీ మంత్రులు, నేతలు ఇవాళ సీఈవో ముకేష్ కుమార్ మీనాను కలవబోతున్నారు.

ఇవాళ ఉదయం 11.30 కి అమరావతిలోని సెక్రటేరియట్ లో మంత్రులు జోగి రమేశ్,మేరుగ నాగార్జున,మండలి విప్ అప్పిరెడ్డి సీఈవోను కలవనున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు, పలు చోట్ల ఓట్ల తొలగింపు, ఏపీ-తెలంగాణ లో ఓట్లు కలిగిఉండటం పై వైసీపీ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేయనున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. అయితే ఇందులో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపులపై గతంలోనూ ఫిర్యాదులు చేసినా రెండు రాష్ట్రాల్లో ఓటుపై మాత్రం ఇప్పుడు వైసీపీ చేయబోతున్న ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.

ysrcp to approach ec agaisnt dual votes in both telugu states amid telangana polls

ఓవైపు రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇందులో ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో సెటిలైన కోట్లాది కుటుంబాలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాయి. వీరిలో చాలా మందికి ఏపీలోనూ ఓటు హక్కు ఉంది. అలాగే తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్న అధికార పార్టీ బీఆర్ఎస్ తో వైసీపీకి గట్టి సంబంధాలే ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో వైసీపీకి బద్దవ్యతిరేకిగా ఉన్న చంద్రబాబుకు హైదరాబాద్ లో సెటిలర్ల అండ ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు కలిగి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న వారిని అడ్డుకునేందుకే ఈసీకి వైసీపీ ఈ ఫిర్యాదు చేయబోతోందా అన్న చర్చ జరుగుతోంది. అలాగని వైసీపీ ఫిర్యాదు చేసినా వెంటనే తెలంగాణ ఎన్నికల్లో వారిని అడ్డుకునే పరిస్ధితి ఉండదు. కానీ రేపు ఏపీలో జరిగే ఎన్నికల నాటికి ఈ తెలంగాణ సెటిలర్ల ఓట్లు ఇక్కడ తొలగిస్తే మాత్రం వారికి ఇబ్బందులు తప్పవు. దీంతో వైసీపీ ఫిర్యాదు, దానిపై ఈసీ తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+