Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ మరో జాబితా - టీడీపీ, సినీ ప్రముఖులకు సీట్లు : లిస్టులో ఎవరెక్కడ..!!

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల కసరత్తు సీఎం జగన్ వేగవంతం చేసారు. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన వైసీపీ నాలుగో లిస్టు విడుదలకు సిద్దమైంది. ఇప్పటి వరకు 59 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల ను మార్పు చేసారు. మరో 14 మందితో ఈ సారి లిస్టు విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇందులో టీడీపీ నుంచి వచ్చిన నేతలు, సినీ ప్రముఖులు ఉండనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎంపీ అభ్యర్దులనే ఈ సారి ఖరారు చేసే అవకాశం ఉంది.

మరో జాబితా సిద్దం: ముఖ్యమంత్రి జగన్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 59 మందితో మూడు లిస్టులను వరుసగా విడుదల చేసారు. నాలుగో జాబితాలో 14 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగానూ ఖరారు చేసారు.

YSRCP to release Fourth list of contesting Candidates for Lok sabha soon, names in the list is here

ఇప్పుడు చేస్తున్న కసరత్తులో కొత్త అభ్యర్దులకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో కొందరి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. నర్సరావు పేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు కు గుంటూరు సీటు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన. దీని పైన ఇంకా తుది నిర్ణయం జరగలేదు. నర్సరావుపేట పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు బీసీలకు అవకాశం లేకపోవటంతో ఎంపీగా బీసీలకు ఇవ్వాలనేది సీఎం జగన్ ఆలోచన.

ఎవరి సీటు ఎక్కడ: ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు అంగీకరిస్తే ఆయన్ను గుంటూరు ఎంపీగా బరిలోకి దింపనున్నారు. నర్సరావు పేట స్థానంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానరావుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. విజయనగరం - మజ్జిశ్రీనివాస రావు, అనకాపల్లి - పీలా రమాకుమారి, కాకినాడ- చెలమలశెట్టి సునీల్, బాపట్ల- నందిగం సురేష్, నర్సాపురం - గోకరాజు రంగరాజు పేర్లు దాదాపు ఖాయంగా కనిపస్తున్నాయి.

మచిలీపట్నం నుంచి వంగవీటి రాధా, మాజీ ఎంపీ కుమార్తె పేరు రేసులో ఉన్నాయి. ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డి లేదా మద్దిశెట్టి వేణుగోపాల్ లో ఒకరికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. రాజమండ్రి నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన డాక్టర్ పద్మలత లేదా సినీ డైరెక్టర్ వీవీ వినాయక్ లో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపిస్తోంది.

తుది కసరత్తు: అమలాపురం నుంచి రాపాక వర ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యరావు ల్లో ఒకరిని బరిలోకి దించే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమైంది. నంద్యాల నుంచి సినీ నటుడు ఆలీకి ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో గుంటూరు నుంచి ఆలీ పేరు పరిశీలనలో ఉంది.

ఈ రోజు లేదా రేపు మొత్తం ఎంపీ అభ్యర్దుల పేర్లు ఫైనల్ చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో మార్పుల పైన కసరత్తు కొనసాగుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేనికి సీటు ఖరారైనట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా అభ్యర్దుల జాబితా ఖరారు చేసి ఇక ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+