చరిత్ర సృష్టించనున్న భారత సంతతి ఆస్ట్రోనాట్ అనీల్ మీనన్.. ఇతని గురించి తెలుసా..?

భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ డాక్టర్ అనిల్ మీనన్(49) అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అయ్యారు. ఇన్నేళ్ల పాటు అనేక మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడంలో సేవలు చేసిన అనిల్ మీనన్.. ఇప్పుడు స్వయంగా తానే అంతర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్ల‌నున్నారు.

ఈ మేరకు జూలై 14వ తేదీన క‌జ‌కిస్తాన్‌ లోని బైక‌నూరు కేంద్రం నుంచి నాసా ఆస్ట్రోనాట్ డాక్టర్ అనిల్ మీనన్ నింగికి ఎగ‌ర‌నున్నారు. రష్యాకు చెందిన సోయుజ్ ఎంఎస్-29 స్పేస్ క్రాఫ్ట్ లో ఆయన ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టనున్నారు. అమెరికా అంతరిక్షరంగ సంస్థ అయిన నాసాలో ఇప్పటి వరకూ అనేక పరిశోధనలు, వ్యోమగాముల కోసం ఎమర్జెన్సీ మెడిసిన్, మిలిటరీ సర్వీస్, ఏరోస్పేస్ మెడిసిన్, కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారు. ఇప్పుడు ర‌ష్యాకు చెందిన మ‌రో ఇద్ద‌రు కాస్మోనాట్స్‌ తో క‌లిసి ఆయ‌న స్పేస్ యాత్ర ప్రారంభించనున్నారు. అక్కడ దాదాపు ఎనిమిది నెలల పాటు కీలక పరిశోధనలు నిర్వహించనున్నారు.

భారత సంతతి నాసా ఆస్ట్రోనాట్ అనీల్ మీనన్ భారత, ఉక్రెయిన్ వలసదారుల కుటుంబంలో మిన్నియాపోలీస్ లో జన్మించారు. అక్కడే పెరిగారు. సానాలోకి అడుగుపెట్టకముందు అనిల్ మీనన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ ఫిజీషియన్ ఇంజినీర్ గా పనిచేసేవారు. మీనన్ 2014 లో నాసాలో అడుగుపెట్టారు. ఫ్లైట్ సర్జియన్ గా విధుల్లో చేరారు. 2018 లో స్పేస్ ఎక్స్ కు చెందిన ఫస్ట్ ఫ్లైట్ సర్జియన్ గా మారారు. స్పేస్ ఎక్స్ కు సంబంధించి మెడికల్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించారు. హెల్త్ కేర్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. చారిత్రాత్మక డెమో2 మిషన్ కు వ్యోమగాములను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

అనంతరం స్పేస్ ఎక్స్ కు చెందిన ప్రైవేట్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ ను అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే స్టార్ షిప్ అభివృద్ధికి సాయం చేశారు. ఈ ఫ్యూచర్ మిషన్ మార్స్, చంద్రుడి మీదకు పరిశోధనల కోసం డెవలప్ చేశారు. అలా క్రమంగా పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం అమెరికన్ స్పేస్ ఫోర్స్‌ లో కల్నల్ హోదాలో ఉన్నారు అనిల్ మీనన్. ఇక సంవత్సరాల పాటు ఇతర ఆస్ట్రోనాట్స్ కు సేవలు అందించిన మీనన్.. ఇప్పుడు తన సొంత జర్నీ కోసం ట్రైనింగ్ అవుతున్నారు. అలా డిసెంబర్ 2021లో మీనన్ నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అప్పటినుంచి తన ట్రైనింగ్ ను వేగవంతం చేశారు.

ఇక మీనన్ హార్వర్డ్ యూనివర్సిటీలో న్యూరో బయోలజీ విద్యను అభ్యసించారు. అలాగే స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ సంపాదించారు. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలా ఆస్పత్రుల్లోనే కాకుండా అనేక విధానాలుగా ఆయన వైద్య సేవలను ప్రజలకు అందించారు. 2010 హైతి భూకంపం, 2011 రేనో ఎయిర్ షో డిజాస్టర్ అలాగే 2015 లో నేపాల్ భూకంపంలో తన సేవలను అందించారు అనిల్ మీనన్. యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ సర్జియన్ గా అఫ్గానిస్తాన్ లో చేపట్టిన ఆపరేషన్ ఎండూరింగ్ ఫ్రీడమ్ లో సేవలు అందించారు.

అలాగే భారత్ లోనూ ఆయన తన సేవలను అందించారు. రోటరీ అంబాసడోరియల్ స్కాలర్ గా ఓ సంవత్సరంపాటు పోలియో వ్యాక్సినేషన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ లో క్లైంబర్స్ కోసం వైద్య సాయం చేశారు. అలా ఓ వైపు మెడికల్ కెరీర్ ను కొనసాగిస్తూనే మీనన్.. యూఎస్ స్పేస్ ఫోర్స్ లో కల్నల్ స్థాయికి చేరారు. అలాగే గుర్తింపు పొందిన ప్లైట్ ఇన్ స్ట్రక్టర్ గా దాదాపు వెయ్యికు పైగా ఫ్లైయింగ్ అవర్స్ సాధించారు. దాంతోపాటు 100 కు పైగా మిషన్స్ లో తన పాత్ర ఉంది.

అనిల్ మీనన్ తొలిసారిగా జులై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన తొలి స్పేస్ యాత్రను ప్రారంభించనున్నారు. రష్యాకు చెందిన సోయుజ్ ఎంఎస్-29 స్పేస్ క్రాఫ్ట్ లో ఆయన ప్రయాణం సాగనుంది. ఆయనతోపాటు రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు పయోట్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా స్పేస్ యాత్ర చేపట్టనున్నారు. మూడు గంటల జర్నీ తర్వాత ఈ బృందం అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కు చేరుకోనుంది. అక్కడే ఈ బృందం నాసా వ్యోమగాములు అయిన జెస్సికా మీర్, జాక్ హాత్ వే, క్రిస్ విలియమ్స్ అలాగే యూరోప్ స్పేస్ ఏజెన్సీకు చెందిన సోఫీ అడెనాట్, రష్యా కు చెందిన సెర్గీవ్ వర్చోక్, సెర్గీవ్ మికావ్, ఆండ్రీ ఫెడీయాన్ లను కలుసుకోనుంది.

AnilMenon Indian-origin astronaut Anil Menon to the space station Do you know about Anil Menon

ఇక మీనన్, డుబ్రోవ్, కికిన చెందిన బృందం దాదాపు 8 నెలలు స్పేస్ స్టేషన్ లోనే గడిపి వివిధ అంశాలపై పరిశోధనలు చేయనుంది. అలా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి తిరిగి భూమిపైకి చేరుకోనుంది. ఇక ఐఎస్ఎస్ లో మీనన్ అనేక పరిశోధనలు చేపట్టనున్నారు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం ఉన్న కారణంగా మానవ శరీరంపై ప్రభావం, మార్పులు, మైక్రో గ్రావిటీ ద్వారా రక్త ప్రసరణ మార్పులపై అధ్యయనం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+