హరీష్ పై కాంగ్రెస్ అభ్యర్దిగా - మారుతున్న లెక్కలు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. 2028 నవంబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029 లో పార్లమెంట్ తో పాటుగా జరుగుతాయని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది తామేనని బీఆర్ఓస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో సిద్దిపేట లాంటి బీఆర్ఎస్ కంచుకోటలో పోటీ పైన కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్య లు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాల అమలుకు సిద్దం అవుతున్నాయి. సీఎం రేవంత్ వచ్చే ఎన్నికలు 2029 లోనే.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా రేవంత్ చెబుతున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సమయంలో నే రేవంత్ లెక్కల పైన కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వచ్చే ఎన్నిక ల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయటం లేదని.. తన సతీమణి నిర్మల పోటీ చేస్తారని ప్రకటించారు. తాను మాజీ మంత్రి హరీష్ పైన సిద్దిపేట నుంచి పోటీకి సిద్దంగా ఉన్నానని కీలక ప్రకటన చేసారు. దీని పైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు.

హరీష్ పై పోటీకి జగ్గారెడ్డి సిద్దం
కాగా, రేవంత్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. రేవంత్ సూచనలతో ఎమ్మెల్యేలంతా అలెర్ట్ అవుతున్నారని, క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా లేని ప్రజాప్రతినిధులను సీఎం అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు వచ్చాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు. తీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలో లేదో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా, సిద్దిపేట నుంచి జగ్గారెడ్డి పోటీ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.













Click it and Unblock the Notifications