Video: రాకెట్‌పై పడ్డ భారీ పిడుగు.. రోదసిలో అరుదైన అద్భుతం..

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఊహించని అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రయోగ కేంద్రం నుంచి రయ్‌మంటూ ఆకాశంలోకి దూసుకెళ్తున్న రాకెట్‌పై అకస్మాత్తుగా ఒక భారీ పిడుగుపడింది. ఆ సమయంలో అక్కడ భూమి కంపించినట్లయి, ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆ ధాటికి చిన్న గాయం కూడా కాకుండా, ఆ రాకెట్ అనుకున్న లక్ష్యం దిశగా నింగిలోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

సెకన్ల వ్యవధిలో మెరుపు దాడి..

చైనాలోని జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి 'లాంగ్ మార్చ్ 3బీ' రాకెట్ నింగిలోకి లేచింది. ఉపగ్రహాన్ని సురక్షితంగా మోసుకెళ్తూ నింగిలోకి దూసుకెళ్తున్న దాదాపు 30 సెకన్ల సమయానికి ఆకాశంలో నుంచి విరుచుకుపడిన భయంకరమైన మెరుపు నేరుగా రాకెట్‌ను ఢీకొట్టింది. ప్రయోగం విఫలమైపోయిందేమోనని అక్కడ ఉన్నవారంతా భావించారు. కానీ రాకెట్‌లోని అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఈ పిడుగుపాటును తట్టుకుని నిలబడింది. చైనా స్పేస్ స్టేషన్‌తో పాటు ఇతర అంతరిక్ష నౌకలకు సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను అనుకున్న కక్ష్యలో ప్రవేశపెట్టి ప్రయోగాన్ని విజయవంతం చేసింది.

Lightning Strikes Long March 3B Rocket After Liftoff China Successfully Delivers Satellite To Orbit

చరిత్రలో ఇదో అరుదైన ఘట్టం!

గాల్లోకి లేచిన రాకెట్లపై పిడుగులు పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో నాసా చేపట్టిన చారిత్రాత్మక మూన్ మిషన్ అపోలో-12 ప్రయోగంలోనూ నింగిలోకి లేచిన 'సాటర్న్ 5' రాకెట్‌ను ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు పిడుగులు తాకాయి. ఆ సమయంలో కొన్ని చిన్నచిన్న సెన్సార్లు దెబ్బతిన్నప్పటికీ అంతరిక్ష వ్యోమగాములు సురక్షితంగా చంద్రుడిపై అడుగుపెట్టారు. అయితే కొన్ని సందర్భాల్లో విపత్తులు కూడా సంభవించాయి. 1987లో ఒక అమెరికన్ రాకెట్‌ను పిడుగు తాకడంతో దానికి దారిచూపే కంప్యూటర్లు పాడైపోయి గాల్లోనే రాకెట్ ముక్కలైపోయింది.

జాగ్రత్తలు పెంచిన అంతరిక్ష సంస్థలు!

ఈ తరహా ప్రమాదాల అనుభవాల దృష్ట్యా నాసా వాతావరణ పరిస్థితులపై కఠినమైన నిబంధనలను (LLCC) అమలులోకి తెచ్చింది. ప్రతికూల వాతావరణంలో ప్రయోగాలు చేయకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే తాజా ప్రయోగంలో చైనా రాకెట్ పిడుగు ధాటిని తట్టుకుని విజయం సాధించడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+