నేడు దేవశయని ఏకాదశితో రెండు అద్భుత యోగాలు.. వీరికి తిరుగులేని సంపదలు!

కాలచక్రంలో ప్రతీ రోజుకూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నేడు సూర్యుడు, శని కారణంగా నేడు దశాంశ యోగం ఏర్పడుతుంది. సూర్య, గురువుల కారణంగా గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది. బుధుడు మిధునరాశిలో బలంగా ఉన్నాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటె నేడు దేవశయని ఏకాదశి. అత్యంత పవిత్రమైన, పవర్ ఫుల్ రోజు, నేడు ద్వాదశ రాశులవారి ఫలాలు చూద్దాం.

మేషరాశి: మేషరాశి జాతకులకు నేడు ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నేడు కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించటం మేలు చేస్తుంది.

today rashiphalalu today devashayani ekadashi Guru Aditya Yoga dashansh yoga lucky zodiacs

వృషభ రాశి: వృషభ రాశి జాతకులకు నేడు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో పని చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. నేడు ఆవేశాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.

మిథునరాశి : మిథునరాశి వారికి నేడు ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. మీ సమయస్పూర్తి మిమ్మల్ని కాపాడుతుంది. మిథునరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సమయస్పూర్తి మిమ్మల్ని కాపాడుతుంది.

కర్కాటక రాశి: సూర్య గురువుల కలయిక కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది.

సింహరాశి: సింహరాశి జాతకులకు అన్ని రంగాలలో కలిసి వస్తుంది. నేడు వీరికి అద్భుత అవకాశాలు వస్తాయి. కేతు ప్రభావం వలన మనసులో అప్పుడప్పుడు కొంత అయోమయం ఉంటుంది. ధ్యానం , ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి ఉంటుంది.

కన్యారాశి : కన్యారాశి వారికి నేడు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పాత మిత్రులను కలవటం వలన రోజంతా సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి మంచి రోజు.

తులారాశి : తులారాశి జాతకులకు ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

ధనుస్సు రాశి : ధనుస్సు రాశి జాతకులు కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే వారికి కలిసి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ లు ప్రారంభించటానికి అనుకూల సమయం.

మకరరాశి : మకరరాశి వారు నేడు కుటుంబ వ్యవహారాల్లో సర్దుబాటు ధోరణితో ఉండాలి. వ్యాపారాలు విస్తరించాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి.

కుంభరాశి : కుంభరాశి వారికి నేడు పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో అనవసర వివాదాలకు దిగకుండా ఉండటం ఉత్తమం.

మీనరాశి : మీనరాశి వారికి నేడు ఆర్ధిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శాంతి ఉంటాయి. మీ భవిష్యత్ ప్రణాళికలను నేరవేర్చుకోవటానికి ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందడుగు వెయ్యాలి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+