హైపర్ ఆదికి డైపర్ వెయ్యాల్సిందే.. ట్రోల్ చేస్తున్న వైసీపీ; పవన్‌కు మద్దతుగా వ్యాఖ్యల ఎఫెక్ట్!!
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడారు. అంతేకాదు వైసిపి నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా వైసిపి నాయకులు, అభిమానులు, వైసిపి సోషల్ మీడియా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

వైసీపీ మంత్రులు, నేతలపై హైపర్ ఆది సంచలనం
జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన హైపర్ ఆది టైమింగ్ బట్టి పంచ్ వేయడంలో దిట్ట. అటువంటి ఆది శ్రీకాకుళంలో జనసేన నిర్వహించిన యువ శక్తి సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న వారికి జబర్దస్త్ పంచ్ లు వేశారు. పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. తనదైన శైలిలో వైసిపి నాయకులపై సెటైర్లు వేశారు. వైసిపి నాయకులపై, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జబర్దస్త్ పంచ్ లు వేసిన హైపర్ ఆది
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ గురించి చాలా కీలకమైన విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయాడని పదేపదే ఎద్దేవా చేస్తున్నారు.. ఓడిపోతేనే ఇంతమంది కష్టాలను తీర్చాడు అంటే గెలిస్తే వాళ్లకు కష్టం కాంపౌండ్ వాల్ దాటనివ్వడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆస్తులు కూడబెట్టుకునే మనస్తత్వం కాదని పేర్కొన్నారు. ఇక ఆ శాఖ ఈ శాఖ అని పవన్ కళ్యాణ్ ని తిట్టడం దేనికని ప్రశ్నించిన ఆయన పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖ అని పేరు పెట్టుకుంటే సరిపోదా అంటూ వైసిపి మంత్రులకు పంచ్ వేశారు. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని టార్గెట్ చేసిన రోజాను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు.

హైపర్ ఆదిని టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు
ప్రపంచంలో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ ను ఒక మాటనేసి పాపులర్ అయిపోదాం అనుకున్న వాళ్లే అని పేర్కొన్న హైపర్ ఆది పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీని దెబ్బ కొట్టాలని చూస్తే.. ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడంటూ రెచ్చిపోయారు. ఇక హైపర్ ఆది వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసిపి నేతలు ఆదిని టార్గెట్ చేస్తున్నారు. హైపర్ ఆది గాడికి డైపర్ వేయాల్సిన టైం వచ్చిందని.. అతని ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ చేసి అందరూ పద్ధతిగా పలకరించాలంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్మీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది .

హైపర్ ఆదికి డైపర్ వెయ్యాలంటూ పోస్ట్ వైరల్
ఇక ఈ ఫేస్బుక్ పోస్ట్ ని రోజా సెల్వమణి పేరుతో ఉన్న మరో అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు హైపర్ ఆదికి డైపర్ వెయ్యాలంటూ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఒక నెంబర్ కూడా ఇవ్వడంతో వైసీపీ అభిమానులు ఆ నెంబర్ కి కాల్ చేసి ట్రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంతకీ ఆ నెంబర్ జబర్దస్త్ హైపర్ ఆదిదేనా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఫాలోయర్స్ రచ్చ
ఇటీవల కాలంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతిపక్షాల మీద విరుచుకు పడడంలో తనదైన దూకుడును చూపిస్తున్నారు. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఆయన తన ఆర్మీతో హైపర్ ఆదిని ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హైపర్ ఆది తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన గట్టిగానే వైసిపి నాయకులకు టార్గెట్ అయ్యారని, హైపర్ ఆదికి వైసిపి నాయకులు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నారని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications