జగన్ క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ పై ప్రభుత్వానికి వైసీపీ లేఖ-ఏం చేయాలంటే ?
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ అప్పటివరకూ ఉపయోగించుకున్న క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ విషయంలో అధికార టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఇవాళ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఫర్నిచర్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు వైసీపీ తరఫున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఈ లేఖపై ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.
గత సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ఫర్నీచర్‌పై జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఇందులో ఆయన క్యాంప్ ఆఫీసులో ఫర్నీచర్ వెంటనే తీసుకుపోవాలని జీఏడీని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే 4సార్లు లేఖ రాశామని, తేదీలతో సహా వెల్లడించారు. ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని అధికారుల్ని ఎమ్మెల్సీ సూటిగా ప్రశ్నించారు.

కేవలం నిందలు మోపడానికే, దీనిపై స్పందించడం లేదా అని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫర్నీచర్‌ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో చెప్పాలని ఆయన లేఖలో కోరారు. ఒకవేళ ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామన్ని కూడా వైయస్సార్‌సీపీ ఆఫర్ చేసింది.నాటి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చినందువల్ల, ఈ ఫర్నీచర్ వల్ల ఆఫీస్‌లో స్థలాభావం నెలకొందని లేఖలో స్పష్టం చేసింది. ఏ విషయమో వెంటనే చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది.












Click it and Unblock the Notifications