Kommineni Srinivasa Rao: కొమ్మినేనికి సుప్రీం ఊరట..! వైసీపీ రియాక్షన్ ఇదే..!
అమరావతిని వైశ్యల రాజధాని పేరుతో సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షిలో ప్రసారమైన డిబేట్ విషయంలో కొమ్మినేనిని మందలించిన సుప్రీంకోర్టు.. ఆయన్ను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని సూచించింది. బెయిల్ షరతులపై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది.
కొమ్మినేని అరెస్ట్ పై సుప్రీం కోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇచ్చిందని వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ పై సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వం కు చెంప పెట్టు అన్నారు. రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీం కోర్టు తీర్పు తో బుద్ధి చెప్పిందని తెలిపారు. ఏపీ లో పత్రిక స్వేచ్ఛ ను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు లాంటిదన్నారు. సాక్షి కార్యాలయాలు పై దాడి చేసిన గుండాలు, రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలని తెలిపింది.

మరోవైపు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. కొమ్మినేనిని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు హర్షనీయమన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టు అన్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంపపెట్టు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో కొమ్మినేనిది అక్రమ అరెస్టు అని తేలిందన్నారు. కొమ్మినేని అరెస్టు వ్యవహారంపై సుప్రీం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిందని,
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక అన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications