వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ రఘురామ కాదు, కేసీఆర్ -జగనన్న కాలనీకి ప్రధాని మోదీ నిధుల సాధన -పార్లమెంట్‌లో వైసీపీ వ్యూహాలివే

|
Google Oneindia TeluguNews

రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో వైసీసీ హైకమాండ్ ప్రయత్నాలు వరుసగా విఫలమవుతోన్న క్రమంలో, ఆయనపై వేటు పడేలా అవసరమైతే పార్లమెంటును సైతం స్తంభించాలన్న ఎత్తుడలో తీవ్రతను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రఘురామ బదులు, పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని, తెలంగాణ అక్రమాలపై దూకుడు పెంచాలని, వరదాయిని పోలవరం, మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్, జీవనాడి ప్రత్యేక హోదా అంశాలపై ఢిల్లీలో రాజీలేని పోరాటం చేయాలని వైసీపీ డిసైడింది..

 కాంగ్రెస్ జోరు, పంజాబ్ కెప్టెన్‌ సిద్దూ -పీసీసీ చీఫ్‌గా నియామకం -వర్గపోరులో ఓడిన సీఎం -రేవంత్ రెడ్డిలా కాంగ్రెస్ జోరు, పంజాబ్ కెప్టెన్‌ సిద్దూ -పీసీసీ చీఫ్‌గా నియామకం -వర్గపోరులో ఓడిన సీఎం -రేవంత్ రెడ్డిలా

ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీపీ) సమావేశం జరిగింది. ప్రాధాన్యతా క్రమంలో ఏయే అంశాలపై గళం వినిపించాలో ఎంపీలకు అధినేత వివరించారు. వైఎస్సార్సీపీపీ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, పార్లమెంటులో వైసీపీ ఏం చేయబోతోందనే విషయాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియాకు వివరించారు.

జగన్ తొలి అస్త్రం రఘురామపైనేనా? -పార్లమెంట్ స్తంభన తప్పదా? -వ్యూహాలపై ఎంపీలకు సీఎం నిర్దేశంజగన్ తొలి అస్త్రం రఘురామపైనేనా? -పార్లమెంట్ స్తంభన తప్పదా? -వ్యూహాలపై ఎంపీలకు సీఎం నిర్దేశం

కేసీఆర్ తీరుపై పోరు ఉధృతం

కేసీఆర్ తీరుపై పోరు ఉధృతం

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామంటోన్న వైసీపీ, జల, విద్యుత్, ఇతరత్రా అంశాల్లో తెలంగాణ ప్రదర్శిస్తోన్న దూకుడుకు కేంద్రమే కళ్లెం వేసేలా పార్లమెంటులో పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, కేఆర్‌ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు, తెలంగాణ నుంచి రూ.6,112 కోట్లు విద్యుత్‌ బకాయిల సాధనపైనా ఫోకస్ పెడతామన్నారు. ఇటీవల వరుస ప్రెస్ మీట్లలో రెబల్ ఎంపీ రఘురామ అంశాన్ని పార్లమెంటులో హైలైట్ చేస్తామని, అవసరమైతే సభను అడ్డుకుంటామని కూడా హెచ్చరించిన సాయిరెడ్డి.. ఇవాళ్టి ప్రెస్ మీట్ లో రఘురామ గురించి మీడియా ప్రశ్నించగా, సీఎం చర్చించే అంతటి స్థాయి నర్సాపురం ఎంపీది కాదని వ్యాఖ్యానించారు. ఇక,

Recommended Video

CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu
జగనన్న కాలనీలకు ప్రధాని నిధులు

జగనన్న కాలనీలకు ప్రధాని నిధులు


ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, పోలవరం ప్రాజెక్ట్‌ పెండింగ్‌ నిధుల అంశాన్ని లేవనెత్తుతామని, అలాగే, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానూ పోరాడుతామని, విభజన హామీలతోపాటు ప్రత్యేక హోదా అంశంపైనా మాట్లాడుతామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీలో సరికొత్తగా నిర్మిస్తోన్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని, దిశ చట్టం ఆమోదం, సాలూరులోనే ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు అంశాలనూ లేవనెత్తుతామని సాయిరెడ్డి వివరించారు.

English summary
andhra pradesh chief minister and ysrcp chief ys jagan mohan reddy directed his party mps to rais the issues like polavaram project, disputes with telangana, privatisation of visakhapatnam steel plant, centre aid to jagananna colonies etc. ysrcp parliamentary party meeting chaired by jagan held on thursday. ysrcp mp vijaya sai reddy told media on ysrcpp meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X