రాష్ట్రవ్యాప్తంగా "జగన్ కోసం సిద్ధం"-స్వచ్చందంగా 9 లక్షల స్టార్ క్యాంపెయినర్లు..!
ఏపీలో మరో వారం రోజుల్లో జరిగే ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ తుది అస్త్రాల్ని బయటికి తీస్తోంది. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన వారితో స్వచ్చందంగా రాష్ట్రవ్యాప్తంగా జగన్ కోసం సిద్ధం పేరుతో మరో ప్రచారం ప్రారంభించింది. ఇందులో తొలిరోజే 9 లక్షల మంది స్వచ్చంద స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనడం విశేషం. ప్రతి బూత్, ప్రతి గడపలో వైఎస్సార్ సీపీ స్టార్ క్యాంపెయినర్లు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47వేల బూత్‌లలో వైఎస్సార్ సీపీ స్టార్ క్యాంపెయినర్లతో చేపట్టిన "జగన్ కోసం సిద్ధం" అట్టహాసంగా. ప్రారంభమైంది. వైసీపీ తనకున్న 2.5 లక్షల బూత్ స్థాయి కార్యకర్తల ద్వారా ఈ స్టార్ క్యాంపెయినర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. బూత్ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ప్రతి కుటుంబాన్ని సందర్శించి గత ఐదేళ్లలో ఆ కుటుంబానికి జరిగిన లబ్దిని వివరిస్తూ.. పేదల అభివృద్ధి కోసం సీఎం జగన్ ని మళ్లీ గెలిపించుకుందాం అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు.

ప్రతి కుటుంబం నుంచి లబ్దిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలన్న సీఎం జగన్ పిలుపుకు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 9 లక్షలకు పైగా లబ్దిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకుని సీఎం జగన్ కోసం ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తొలి రోజు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో పలు కీలక అంశాలు ఉన్నాయి.ఇందులో లక్షలాది మంది స్వచ్చందంగా నమోదు చేసుకోవడంతో పాటు తమకు కలిగిన లబ్దిని ఇతరులకు వివరిస్తున్నారు.

అలాగే వైఎస్సార్ సీపీ 2024 ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ను వీరు ప్రతి ఇంటికీ అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను విజయవంతంగా అమలు చేసిన తీరును గుర్తు చేసి.. 2024 మేనిఫెస్టో అమలు కోసం సీఎం జగన్ ను గెలిపించుకుందాం అంటూ ఈ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications