Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా అంటే ఇంకో ఏడాది.. అంతే: బాంబు పేల్చిన వైసీపీ ఎమ్మెల్యే

YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. వరుస ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది.

వైద్య విద్యార్థుల ఉదంతం దీనికి తోడైంది. ఇప్పటికే దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైతం స్పందించారు. విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా అంటూ నిలదీశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్‌ లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ (FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వట్లేదని నిలదీశారు.

YSRCP s MLA Tataparthi Chandra Sekhar criticized Andhra Govt

ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘకాలం వెట్టి చాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూరకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాల‌కు పంపించారని, వాళ్లంతా కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారని అన్నారు.

అలాంటి వారి కెరీర్‌ ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది ప్రభుత్వ ప్లాన్‌లో భాగం కాదా అని జగన్ నిలదీశారు. డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వరంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా గతంలో తమ ప్రభుత్వం పనులు చేసి, అందులో అయిదు కాలేజీలను ప్రారంభించిందని గుర్తు చేశారు.

దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తోన్నారు వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులు. తాజాగా ఈ అంశంపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్యమాలు తలెత్తుతున్నాయని అన్నారు.

ఇదివరకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, బదిలీలపై ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈ ఆందోళనలను ఇతర విభాగాలు, శాఖలకు చెందిన ఉద్యోగులు సైతం చేపట్టే అవకాశాలు లేకపోలేదని ఆయన జోస్యం చెప్పారు.

ఇంకా మూడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, పే- రివిజన్ కమిటీ ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొని ఉందని ఆయన గుర్తు చేశారు. పదోన్నతులతో పాటు పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయట్లేదని చెప్పారు. సరెండర్ సెలవుల వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. మరో ఏడాది అంతే.. చంద్రబాబు తప్పిన హామీలపై రాష్ట్రం ఉద్యమాంధ్రాగా మారడం ఖాయమని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+