బహునేర్పరి.. పురందేశ్వరి: తగ్గని సాయిరెడ్డి
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటోన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గతాన్ని తవ్వి పోసుకుంటోన్నారు.
విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌పై కొనసాగుతున్నారని, అందులో పొందుపరిచిన షరతులను ఉల్లంఘిస్తోన్నారంటూ పురందేశ్వరి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాయడంతో ఆరంభమై ట్వీట్ల వార్ ఇది.

తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి స్పందించారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరారంటూ ధ్వజమెత్తారు. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీపై ఆమెకు ప్రేమాభిమానం లేదంటూ ఆరోపించారు. మొదట టీడీపీ..ఆ తరువాత ఎన్టీఆర్ టీడీపీ, అనంతరం బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరికి ఉందని విమర్శించారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.
టీడీపీ నుంచి చంద్రబాబు గెంటేసేసరికి.. అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్‌లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిదని విమర్శించారు. ఏపీని అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా తన వంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి అంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications