వైఎస్ జగన్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక భేటీ..!!
అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కొద్దిసేపటి కిందటే ఆయన జగన్‌తో భేటీ అయ్యారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి.. జగన్‌ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీబీఐ దర్యాప్తుపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి ఇటీవలే కొత్త సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ రాసిన కొద్దిరోజుల్లోనే జగన్‌ను కలిశారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాన్ని ఆయన తోసిపుచ్చారు.
సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు అవినాష్ రెడ్డి అప్పట్లో. ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఆయనపై ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ హయాంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు మొత్తం పక్కదారి పట్టిందని పేర్కొన్నారు. పక్షపాత వైఖరితో రామ్ సింగ్ దర్యాప్తు చేశారంటూ ఆరోపించారు.

రామ్ సింగ్ హయాంలో జరిగిన దర్యాప్తును పునఃసమీక్షించాలని అవినాష్ రెడ్డి కొత్త సీబీఐ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సీబీఐ దాఖలు చేసిన రెండు చార్జ్‌షీట్ల ఆధారంగా అవినాష్ రెడ్డి ఈ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్‌మెంట్ అంశాలను సైతం ఆయన తన లేఖలో ప్రస్తావనకు తీసుకొచ్చారు.
రెండో భార్య షమీమ్‌తో ఆస్తి తగాదా ఉన్న విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి తన లేఖలో పొందుపరిచారు. ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే వివేకాను హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. ఆస్తి కోణంలో ఇప్పటివరకూ విచారణ జరగలేదని అవినాష్ రెడ్డి తేల్చి చెప్పారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులని సవరించాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని కోరారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications