Sajjala On Exit Polls: ఎగ్జిట్ పోల్స్ పై సజ్జల ఏమన్నారంటే ? ట్రెండ్ ఇదేనట..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఇవాళ పలు సర్వే సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఇందులో పలు ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీ మరోసారి విజయం సాధించే అవకాశం ఉందని తేల్చిచెప్పేశాయి. అలాగే లోక్ సభలోనూ వైసీపీకి అత్యధిక స్ధానాలు వస్తాయని తెలిపాయి. దీంతో మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న వైసీపీ నేతల్లో ఇవి సంతోషాన్ని నింపాయి.

ఇవాళ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైసీపీకి అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. తాము అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చాయన్నారు. ఫలితాలు దీనికంటే ఇంకా మెరుగ్గా ఉంటాయన సజ్జల జోస్యం చెప్పారు. మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. తమ పాలనలో మహిళలకు పట్టం కట్టామని గుర్తుచేశారు.

ysrcp s sajjala Ramakrishna reddy welcomes exit polls predictions says as predicted

సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచామని తెలిపారు. భారీస్థాయిలో మహిళలు వైసీపీని మరోసారి ఆదరించారన్నారు. వైసీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చిందన్నారు. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+