హైకోర్టుకు పరుగు తీసిన జగన్ బాబాయ్, నాపై విజిలెన్స్ విచారణ రద్దు చెయ్యండి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఎంతో పవిత్రంగా తయారు చేస్తున్న శ్రీవారి లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి వాడారని ఆరోపణలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.

ఇదే సమయంలో తనపై జరుగుతున్న విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో రద్దు చేయాలని కోరుతూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ. సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీకి ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి తనపై దర్యాప్తు చేసే అధికారం లేదని, తనపై జరుగుతున్న విచారణ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ సీఎం వైయస్ జగన్ చిన్నాన్న, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

YV Subbareddy filed a petition in the High Court requesting that the vigilance investigation against him be quashed

జగన్ ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా పని చేశారు. ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనే విషయంలో మీరు వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ తనను కోరారని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టుకు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి, తనపై ఎందుకు విచారణ చేస్తున్నారనే విషయంపై సంబంధిత పైల్స్ ఇవ్వాలని తాను విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు మనవి చేశానని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి హైకోర్టుకు తెలిపారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తనకు ఎలాంటి ఫైల్స్ ఇవ్వలేదని, తాను వివరణ ఇవ్వకుండానే తనపై విచారణ పూర్తి చేశారని, తనపై జరుగుతున్న విచారణ రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు వైవీ. సుబ్బారెడ్డి హైకోర్టుకు మనవి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

YV Subbareddy filed a petition in the High Court requesting that the vigilance investigation against him be quashed

తిరుమల లడ్డూల తయారి కోసం గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చాప నూనె తదితర పదార్థాలు ఉపయోగించారని ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది..ఇలాంటి సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ అయింది. తప్పు చెయ్యకపోతే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టుకు ఎందుకు వెళ్లారని, విచారణ రద్దు చెయ్యాలని ఎందుకు పిటిషన్ వేశారని కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ. సుబ్బారెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీటీడీ నిధులు దుర్వినియోగం చేశారని, తనకు కావలసిన వారికి కాంట్రాక్టర్లు అప్పగించారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, టీటీడీ సొమ్మును లూటీ చేశారని తిరుపతికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+